English | Telugu

రవితేజ సాలిడ్ లైనప్.. మాస్ రాజా రేంజ్ ఏంటో చూస్తారు!

టాలీవుడ్ స్టార్స్ లో మాస్ మహారాజా రవితేజ ఇమేజ్ ప్రత్యేకం. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నారు. అలాంటి రవితేజ, ఇప్పుడు సాలిడ్ సక్సెస్ కోసం చూస్తున్నారు. 2018 నుంచి రవితేజ నటించిన 12 సినిమాలు విడుదలైతే.. అందులో 'క్రాక్', 'ధమాకా' అనే రెండు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. 2022 లో వచ్చిన 'ధమాకా' తర్వాత వరుసగా నాలుగు ఫ్లాప్స్ చూశారు. దీంతో మాస్ మహారాజా రవితేజ మునుపటిలా ఘన విజయాలు అందుకోవాలని, ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ కోరికను నిలబెట్టేలా ప్రస్తుతం రవితేజ లైనప్ ఉంది. (Ravi Teja)

అక్టోబర్ 31న తన 75వ చిత్రం 'మాస్ జాతర'తో ప్రేక్షకులను పలకరించనున్నారు రవితేజ. 'సామజవరగమన' రైటర్ భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా మాస్ రాజా మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఇది రూపుదిద్దుకుంటోంది.

రవితేజ తన 76వ సినిమాని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్నారు. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని, 2026 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్ లో ఓ థ్రిల్లర్ డ్రామాకి ఓకే చెప్పిన రవితేజ.. అలాగే, 'మ్యాడ్' ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలోనూ ఓ సూపర్ హీరో ఫిల్మ్ చేయనున్నారు.

రవితేజ తదుపరి నాలుగు చిత్రాలు నాలుగు భిన్న జానర్స్ లో వస్తున్నాయి. ఈ లైనప్ చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తుంది. ఈ సినిమాలతో రవితేజ మునుపటిలా మళ్ళీ తన బాక్సాఫీస్ పవర్ ని చూపించడం ఖాయమని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.