English | Telugu

స్టార్‌ హీరో ప్రొడక్షన్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌.. షాక్‌ అయిన ఇండస్ట్రీ?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇటీవలి కాలంలో దీని గురించి చాలా వార్తలు వచ్చాయి. క్యాస్టింగ్‌ కౌచ్‌కి గురయ్యామంటూ ఎంతో మంది నటీమణులు తెరపైకి వచ్చారు. మీటూ పేరుతో ఉద్యమం కూడా నడుస్తోంది. ఇప్పుడు మరోసారి క్యాస్టింగ్‌ కౌచ్‌ కలకలం మొదలైంది. మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ సొంత నిర్మాణ సంస్థలోనే ఈ ఆరోపణలు రావడంతో అందరూ షాక్‌ అవుతున్నారు. వేఫేరర్‌ ఫిలింస్‌ పేరుతో దుల్కర్‌ స్థాపించిన ప్రొడక్షన్‌ హౌస్‌ ఈ వివాదంలో చిక్కుకుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

వేఫేరర్‌ ఫిలింస్‌ సంస్థలో అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న దినిల్‌బాబు.. సినిమా అవకాశం ఇస్తానని చెప్పి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ యువతి ఎర్నాకుళం సౌత్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దినిల్‌ బాబుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తమ సంస్థపై వచ్చిన ఆరోపణలపై వేఫేరర్‌ ఫిలింస్‌ వెంటనే స్పందించింది. దినిల్‌బాబుతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తమ సంస్థ పేరుతో దినిల్‌ మోసాలకు పాల్పడుతున్నాడని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేఫేరర్‌ ఫిలింస్‌ విడుదల చేసిన ప్రకటనలో ‘మా సంస్థ క్యాస్టింగ్‌ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. ఇదంతా సోషల్‌ మీడియా పేజీల ద్వారానే ప్రకటిస్తాం’ అని తెలిపింది. వేఫేరర్‌ ఫిలింస్‌పై వచ్చిన ఆరోపణలపై దుల్కర్‌ అభిమానులు స్పందిస్తున్నారు. దుల్కర్‌ వంటి ఇమేజ్‌ ఉన్న వ్యక్తికి సంబంధించిన సంస్థపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమంటున్నారు. సంస్థ విడుదల చేసిన ప్రకటనతో ఈ వివాదానికి సంబంధించి పూర్తి క్లారిటీ రావడంతో దుల్కర్‌ అభిమానులు, నెటిజన్లు అతనికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.