English | Telugu

నవ్వులు పంచే బ్రహ్మానందం కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఆ షోలో ఏం జరిగింది?

తెలుగు వారు హాస్యప్రియులు అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఏ భాషలోనూ లేనంత మంది కమెడియన్స్‌ టాలీవుడ్‌లో ఉన్నారు. పాతతరం నుంచి ఇప్పటివరకు పరిశీలిస్తే ప్రతి కమెడియన్‌ది డిఫరెంట్‌ స్టైల్‌, డిఫరెంట్‌ మేనరిజం, డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌. తమదైన శైలిలో ఎంతో మంది హాస్యనటులు తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. తెలుగు లెక్చరర్‌గా పనిచేసి 1987 ప్రాంతంలో తెలుగు సినిమాల్లోకి ప్రవేశించిన బ్రహ్మానందం.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. స్క్రీన్‌ మీద ఆయన కనిపిస్తే చాలు.. థియేటర్‌ అంతా నవ్వులే నవ్వులు. 1000కి పైగా సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకుల్ని నవ్వించి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న బ్రహ్మానందం.. సినిమాల్లోనే కాదు, బయట కూడా నలుగుర్నీ నవ్వించడానికే ప్రయత్నిస్తారు. ఏదైనా ఈవెంట్‌కి వచ్చినా అందర్నీ ఎంటర్‌టైన్‌ చేసే విధంగానే ఆయన స్పీచ్‌ ఉంటుంది తప్ప ఎమోషనల్‌ అయిన సందర్భాలు లేవు. కానీ, ఇటీవల ఒక షోలో ఎమోషనల్‌ అవ్వడమే కాకుండా కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే బ్రహ్మానందం ఎందుకు ఎమోషనల్‌ అయ్యారు? కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అనే వివరాల్లోకి వెళితే..

ఆహా ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతున్న తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 4 షోకి గెస్ట్‌గా హాజరయ్యారు బ్రహ్మానందం. ఎప్పటిలాగే తనదైన శైలిలో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశారు. బ్రహ్మానందం లాంటి లెజెండ్‌ కమెడియన్‌ ఆ షోకి రావడం వారికి కూడా గర్వ కారణమే కాబట్టి ఆయనకు సంబంధించిన ఒక ప్రోమోను ప్రదర్శించారు. ఆ ప్రోమో చూసి ఎమోషనల్‌ అయ్యారు. ఆ తర్వాత ఆ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న శ్రీరామచంద్ర.. ‘ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంతో మీకు ఉన్న అనుబంధం ఎలాంటిది?’ అని అడిగాడు. బాలుతో, ఆయన కుటుంబంతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని, ఎంతో మంచి వ్యక్తి అని చెబుతూ ఒక్కసారిగా ఎమోషనల్‌ అయిపోయి కన్నీళ్లు పెట్టుకున్నారు బ్రహ్మానందం. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోమో వైరల్‌గా మారింది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే బ్రహ్మానందం అలా కన్నీళ్లు పెట్టుకోవడంతో కంటెస్టెంట్స్‌, జడ్జీలు భావోద్వేగానికి లోనయ్యారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.