English | Telugu

కొత్త లుక్‌‌లో రజనీకాంత్!

క్లౌడ్ నైన్ అనే ప‌దానికి సిస‌లైన అర్థం ఇదేనా అంటున్నారు ర‌జ‌నీకాంత్‌. ఆయ‌న హీరోగా న‌టించిన జైల‌ర్ ఇచ్చిన స‌క్సెస్ అలాంటిది మ‌రి. త‌న సినిమాల రిలీజ్ త‌ర్వాత హిమాల‌యాల‌కు వెళ్లే ర‌జ‌నీ, ఈ సారి జైల‌ర్ త‌ర్వాత మ‌ళ్లీ వెళ్లారు. ఆధ్యాత్మిక ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తున్నారు సూప‌ర్‌స్టార్‌. దాదాపు 400 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసింది జైల‌ర్ మూవీ. నెల్స‌న్ దిలీప్‌కుమార్ త‌న స్టామినాను ఇంకో సారి ప్రూవ్ చేసుకున్నారు. స‌న్ పిక్చ‌ర్స్ త‌న మీద పెట్టిన న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నారు. అదే విష‌యాన్ని ర‌జ‌నీకాంత్ కూడా ఆనందంగా పంచుకున్నారు. క‌మ‌ల్‌హాస‌న్‌తో స‌హా ఎంతో మంది జైల‌ర్ విజ‌యం ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.
ఈ సినిమా పూర్తి కాగానే కుమార్తె ఐశ్వ‌ర్య ద‌ర్శ‌క‌త్వంలో లాల్ స‌లామ్ సినిమా చేశారు ర‌జ‌నీకాంత్‌. ఇందులోనే జీవిత సూప‌ర్‌స్టార్‌కి చెల్లెలిగా న‌టిస్తున్నారు.

హిమాల‌యాల‌కు వెళ్లిన ర‌జ‌నీ శుక్ర‌వారం చెన్నైకి రిట‌ర్న్ అయ్యారు. టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో త‌లైవ‌ర్ 170వ సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. సెప్టెంబ‌ర్ 15 నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ చెన్నైలో జ‌ర‌గ‌నుంది. అమితాబ్ బ‌చ్చ‌న్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తారు. ఈ సినిమా కోస‌మే ఓ రోల్ చేయ‌మ‌ని నానిని అడిగార‌ట‌. అయితే నాని సున్నితంగా నో చెప్పిన‌ట్టు టాక్‌. ఆల్రెడీ ఈ సినిమా కోసం ఫాహ‌ద్ ఫాజిల్‌, మంజు వారియ‌ర్‌, శ‌ర్వానంద్ కీ రోల్స్ కి సైన్ చేశారు. రిటైర్డ్ కాప్ గురించిన క‌థ ఇది. ఎన్కౌంట‌ర్ క‌ల్చ‌ర్‌ని వ్య‌తిరేకించిన రిటైర్డ్ కాప్‌గా క‌నిపిస్తార‌ట ర‌జ‌నీ. లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో త‌లైవర్ కొత్త లుక్‌లో క‌నిపిస్తారు.