English | Telugu

ఇటు నాగ్, అటు పవన్ మధ్యలో ఎన్టీఆర్.. ఎవరు సెన్సేషన్ క్రియేట్ చేస్తారో మరి!

ప్రస్తుతం తెలుగునాట రి-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా రెండు, మూడు దశాబ్దాల నాటి స్టార్ హీరోల సినిమాలు మళ్ళీ థియేటర్ల బాట పడుతున్నాయి. అలాగే ఐదు, పదేళ్ళ క్రితం నాటి చిత్రాలు కూడా మరోసారి ప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు కలెక్షన్స్ పరంగా విస్మయపరుస్తుండడం విశేషం.

ఇదిలా ఉంటే, ఈ ఆగస్టు నెలాఖరులో ముగ్గురు అగ్ర కథానాయకులు చిత్రాలు రిరిలీజ్ కి రెడీ అయ్యాయి. ఈ మూడు సినిమాలు కూడా మూడు వరుస రోజుల్లో మళ్ళీ తెరపైకి రానుండడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 29న కింగ్ నాగార్జున పుట్టినరోజుని పురస్కరించుకుని అతని క్లాసిక్స్ లో ఒకటైన 'మన్మథుడు' (2002)ని రిరిలీజ్ చేయబోతుండగా.. ఆగస్టు 30న రాఖీ పూర్ణిమ సందర్భంగాయంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిన 'రాఖీ' (2006)ని తిరిగి విడుదల చేయబోతున్నారు. ఇక సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కావడంతో.. రెండు రోజుల ముందు అంటే ఆగస్టు 31న మ్యూజికల్ హిట్ 'గుడుంబా శంకర్' (2004)ని రిరిలీజ్ చేయబోతున్నారు. మరి.. ఇటు నాగ్, అటు పవన్ మధ్యలో ఎన్టీఆర్ అన్నట్లుగా రాబోతున్న ఈ రి-రిలీజ్ మూవీస్ లో వేటికి కాసుల వర్షం కురుస్తుందో చూడాలి.