English | Telugu

'ఆర్ఆర్ఆర్' కలెక్షన్స్ డ్రాప్.. వేట ముగిసినట్లేనా?

ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆర్ఆర్ఆర్' మూవీ రూ.1000 కోట్ల గ్రాస్ కి చేరువైంది. తాజాగా ముంబైలో మూవీ టీమ్ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరినట్లు సెలబ్రేషన్ కూడా చేసుకుంది. అయితే ఈ మూవీ ముందు ముందు మరిన్ని సంచలనాలు సృష్టిస్తుంది అనుకుంటుంటేరెండో సోమవారం నుంచి కలెక్షన్స్ భారీగా డ్రాప్ అవుతూ వస్తున్నాయి.

దాదాపు అన్ని చోట్లా ప్రాఫిట్స్ లోకి అడుగుపెట్టిన ఆర్ఆర్ఆర్.. ఓవరాల్ గా మాత్రం 'బాహుబలి-2' కలెక్షన్స్(1800 కోట్ల గ్రాస్)కి దగ్గరకు కూడా వెళ్లలేకపోతోంది. ముఖ్యంగా 11 రోజు నుంచి కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. రెండో ఆదివారం 44.80 కోట్ల షేర్ రాబట్టి సత్తా చాటిన ఆర్ఆర్ఆర్ సోమవారం12.68 కోట్లు, మంగళవారం 11.58 కోట్లకు పడిపోయింది. ఇక 13 వ రోజు అయిన బుధవారం నాడు అయితే 7.44 షేర్(13 కోట్ల గ్రాస్)కి పరిమితమైంది. వరల్డ్ వైడ్ గా 451 కోట్ల బిజినెస్ చేయగా 13 రోజుల్లో దాదాపు 528.50 కోట్ల షేర్(951.50 కోట్ల గ్రాస్) రాబట్టింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ లో 600 కోట్ల షేర్(1100 కోట్ల గ్రాస్)తో సరిపెట్టుకునే అవకాశముంది.

తెలుగు రాష్ట్రాల్లో రూ.191 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ 13 రోజుల్లో 246.90 కోట్ల షేర్(371 కోట్ల గ్రాస్) రాబట్టి 250 కోట్ల షేర్ దిశగా పరుగులు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 11 వ రోజు 4.98 కోట్లు, 12 వ రోజు 4.88 కోట్ల షేర్ రాబట్టగా.. 13 వ రోజు 2.54 కోట్ల షేర్ కి పడిపోయింది. నైజాంలో 70 కోట్ల బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ 13 రోజుల్లో 102.62 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సీడెడ్ లో 37 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ ఇప్పటిదాకా 46.92 కోట్లు రాబట్టి 50 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. అలాగే ఆంధ్రాలో 84 కోట్లు బిజినెస్ చేయగా ఇప్పటికే 97.36 కోట్లు కలెక్ట్ చేసి వంద కోట్ల వైపు దూసుకుపోతోంది.

13 రోజుల్లో ఓవర్సీస్ లో 90.05 కోట్లు(బిజినెస్ 75 కోట్లు), హిందీలో 99.50 కోట్లు(బిజినెస్ 92 కోట్లు), కర్ణాటకలో 39.30 కోట్లు(బిజినెస్ 41 కోట్లు), తమిళనాడులో 35.05 కోట్లు(బిజినెస్ 35 కోట్లు), కేరళలో 9.85 కోట్లు(బిజినెస్ 9 కోట్లు), రెస్టాఫ్ ఇండియా 7.85 కోట్లు(బిజినెస్ 8 కోట్లు) షేర్ రాబట్టింది. కర్ణాటక మినహా దాదాపు అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ సాధించింది.

ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 75 కోట్లకు పైగా లాభాలు చూసిన ఆర్ఆర్ఆర్.. తెలుగు రాష్ట్రాలలో మినహా ఇతర ప్రాంతాలలో 'బాహుబలి-2' స్థాయిలో బయ్యర్లకు లాభాలు తెచ్చే అవకాశం లేదు అంటున్నారు. ఇప్పటికే కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. పైగా ఇంకా ఒక్క వీకెండ్ మాత్రమే ఉంది. వచ్చే వారం కేజీఎఫ్-2, బీస్ట్, జెర్సీ సినిమాలు రాబోతున్నాయి. ఈలోపు ఆర్ఆర్ఆర్ అద్భుతాలు చేయాల్సి ఉంది.