English | Telugu
రికార్డు స్థాయిలో 'గని' బిజినెస్.. బ్రేక్ ఈవెన్ ఎంతంటే?
Updated : Apr 7, 2022
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'గని'. రినైసెన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై సిద్దు ముద్ద, అల్లు బాబీ నిర్మించిన ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 8 న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఆ అంచనాలకు తగ్గట్లే వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ బిజినెస్ రికార్డు స్థాయిలో రూ.25 కోట్లకు పైగా జరిగింది.
నైజాంలో 8 కోట్లు, సీడెడ్ లో 3.50 కోట్లు, ఆంధ్రాలో 9.50 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన గని.. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 21 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 2.50 కోట్లకు అమ్ముడవ్వగా.. ఓవర్సీస్ లో 1.80 కోట్ల బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 25.30 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన గని 26.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగువుతోంది.
'F2', 'గడ్డలకొండ గణేష్' లాంటి సూపర్ హిట్స్ తరువాత వరుణ్ తేజ్ నటించిన సినిమా కావడంతో గని బిజినెస్ భారీగానే జరిగింది. పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ ఈజీగానే వచ్చేస్తాయి. అయితే ఇప్పటికే థియేటర్స్ లో 'ఆర్ఆర్ఆర్' ఉంది. పైగా వచ్చే వారం 'బీస్ట్', 'కేజీఎఫ్-2' సినిమాలు వస్తున్నాయి. కాబట్టి వారం రోజుల్లోనే గని మెజారిటీ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.