Read more!

English | Telugu

అల్లు స్టూడియోస్ లో 'పుష్ప-2' షూటింగ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న 'పుష్ప-2' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం తగ్గేదేలే అంటూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఇప్పుడు రెండో భాగంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల 'పుష్ప-2' పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మూవీ షూటింగ్ అల్లు స్టూడియోస్ లో జరగనుందని సమాచారం.

 

టాలీవుడ్ లో కొన్ని బడా ఫ్యామిలీలకు స్టూడియోలు ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో నిర్మాణరంగంలో ఉన్న అల్లు ఫ్యామిలీకి మాత్రం సొంత స్టూడియో లేదు. ఈ క్రమంలో 'అల్లు స్టూడియోస్' పేరుతో వెండితెర, బుల్లితెరకు సంబంధించిన షూటింగ్ ల కోసం భారీ స్టూడియోను నిర్మించారు. అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా అక్టోబర్ 1న ఈ స్టూడియో ప్రారంభం కానుందని సమాచారం. అంతేకాదు ఈ స్టూడియోస్ లో మొదట షూటింగ్ జరుపుకునే చిత్రం 'పుష్ప-2'నే అని తెలుస్తోంది. దసరా తర్వాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని వినికిడి.

 

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ కాగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.