English | Telugu

సమంత 'శాకుంతలం' రిలీజ్ డేట్ వచ్చేసింది

సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ 'శాకుంతలం'. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఇంతవరకు ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ లేదు. దీంతో సమంత ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా విడుదల తేదీని ప్రకటించి సర్ ప్రైజ్ చేసింది మూవీ టీమ్.

పండితుల ప్రశంసలు పొందిన సంస్కృత‌ నాటకం 'అభిజ్ఞాన శాకుంతలం' ఆధారంగా భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో ర‌స‌ర‌మ్య దృశ్య కావ్యంగా రూపొందిన చిత్రం 'శాకుతలం'. కోట్లాదిమంది హృద‌యాల‌ను గెలుచుకున్న శ‌కుంత‌ల‌, దుష్యంత మ‌హారాజు మ‌ధ్య ఉన్న అజ‌రామ‌ర‌మైన ప్ర‌ణ‌య‌గాథ ఇది. శకుంత‌ల‌గా స‌మంత‌, దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ న‌టించారు. ఈ ప్రేమ కావాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా న‌వంబ‌ర్ 4న భారీ ఎత్తున రిలీజ్ చేయ‌బోతున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల‌ కానుంది.

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు స‌మర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నీలిమ గుణ నిర్మాత‌గా శాకుంత‌లం సినిమా రూపొందుతోంది. గుణ శేఖర్ కశ్య‌ప క‌నుమ‌లు (కాశ్మీర్‌)లో సాగే ఈ ప్రేమ క‌థ‌ను త‌న‌దైన మార్క్‌తో అద్భుతంగా ఆవిష్క‌రించారని, దుష్యంత పురు రాజ‌వంశం యొక్క వైభ‌వాన్ని గ్రాండియ‌ర్‌గా, క‌ళ్లు చెదిరేలా అసాధార‌ణంగా తెర‌కెక్కించారని మూవీ టీమ్ టీమ్ చెబుతోంది.

ఈ చిత్రంలో స‌చిన్ ఖేడేక‌ర్‌, క‌బీర్ బేడీ, మోహ‌న్ బాబు, ప్ర‌కాష్ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువ‌రాజు భ‌ర‌తుడి పాత్ర‌లో న‌టించ‌టం విశేషం.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.