English | Telugu

ఆడవాళ్ళపై నేను అలా చెయ్యలేదు 

బాలీవుడ్ అగ్ర హీరోయిన్ 'ప్రియాంక చోప్రా'(Priyanka Chopra)ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu)రాజమౌళి(ss Rajamouli)కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో చేస్తుంది. ఈ సినిమాకి సంబందించిన మొదటి షెడ్యూల్ లో ప్రియాంక చోప్రా పాల్గొంది. కొన్ని రోజుల క్రితం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక మాట్లాడుతు 'అబ్బాయిలు వర్జినిటీ ఉన్న అమ్మాయిని కాదు, మంచి గుణాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఎందుకంటే వర్జినిటీ ఒక్క రాత్రితో పోతుంది. కానీ సభ్యత సంస్కారం జీవితాంతం ఉంటాయనే బోల్డ్ కామెంట్స్ ని చేసినట్టుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది.

రీసెంట్ గా ఆ కామెంట్స్ ని సంబంధించిన స్క్రీన్ షాట్ ని షేర్ చేసిన ప్రియాంక ఆ వ్యాఖ్యలపై స్పందిస్తు ఇలాంటి వ్యాఖ్యలని నేను చెయ్యలేదు. కనీసం ఎక్కడ కూడా ఈ విషయంపై మాట్లాడలేదు. ఇదంతా సోషల్ మీడియా సృష్టించిన రూమర్ మాత్రమే. వైరల్ అవ్వడం కోసమే ఇలాంటి వార్తలని సృష్టిస్తున్నారు. ఇలాంటి వార్తలని నమ్మే ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండని ప్రియాంక వివరణ ఇచ్చింది.

గత కొంత కాలంగా ప్రియాంక బాలీవుడ్ లో ఎలాంటి చిత్రాల్లో కనిపించడం లేదు. నిక్కీ జోనస్ అనే అమెరికన్ పాప్ సింగర్ ని పెళ్లి చేసుకున్న ప్రియాంక అమెరికాలోనే స్థిర పడింది. ఆమెకి ఒక బాబు ఉన్నాడు. ఇంగ్లీష్ లో పలు రకాల వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది.