English | Telugu
కుబేర సినిమాకి వెళ్లిన ప్రేక్షకులని గాయాలపాలు చేసారు..ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
Updated : Jun 26, 2025
అక్కినేని నాగార్జున(Nagarjuna),ధనుష్(Dhanush)రష్మిక(Rashmika Mandanna)శేఖర్ కమ్ముల(Sekhar Kammula)కాంబోలో ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా మూవీ 'కుబేర'(Kuberaa). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎల్ఎల్ పి, అమిగోస్ సంయుక్తంగా కలిసి నిర్మించగా దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad)సంగీతాన్ని అందించాడు. జిమ్ సర్బ్, షాయాజీ షిండే, దిలీప్ తాహిల్, భాగ్యరాజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక కుబేర రిలీజ్ అయ్యి వారం రోజులు కాకుండానే వంద కోట్ల క్లబ్ లోకి చేరి సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా దూసుకెళ్తుంది. మూవీ చూసిన ప్రతి ఒక్కరు తమకి సినిమా చూస్తున్నంత సేపు క్యారెక్టర్లు మాత్రమే కనపడ్డాయని చెప్తున్నారు. దీన్ని బట్టి కుబేర ప్రేక్షకులకి ఎంతగా కనెక్ట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.
కుబేర చూడటానికి ప్రేక్షకులు తెలంగాణలోని మహబూబాబాద్ టౌన్ లో ఉన్న 'ముకుంద' థియేటర్ కి సెకండ్ షో కి వెళ్లారు. మూవీ చూస్తున్న ప్రేక్షకులపై ఒక్కసారిగా థియేటర్ సీలింగ్ ఊడి పడింది. దీంతో పలువురు ప్రేక్షకులు గాయాలు పాలవ్వడంతో దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారు. ఈ సంఘటనతో ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యంతో గొడవకి దిగడంతో పాటు, ప్రేక్షకుల భద్రత పట్ల నిర్లష్యంగా వ్యవహరించిన థియేటర్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని కోరారు.