English | Telugu

ప్రముఖ నటిపై లైంగిక దాడి.. ట్విస్ట్ ఇచ్చిన కోర్టు...

ఎనిమిదేళ్ల క్రితం మలయాళ నటిపై లైంగిక దాడి కేసు కేరళలో సంచలనం సృష్టించింది. 2017 లో ఈ ఘటన జరగగా.. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటుచేసికుంది. నిందితుల్లో ఒకరైన ప్రముఖ నటుడు దిలీప్‌ ను కేరళలోని ఎర్నాకుళం కోర్టు సోమవారం నిర్దోషిగా తేల్చింది.

సౌత్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందిన ఓ ప్రముఖ నటి.. 2017, ఫిబ్రవరి 17న కిడ్నాప్‌ కి గురైంది. కొచ్చిలో ఈ ఘటన జరిగింది. ఆ రోజు రాత్రి ఆమెను తన కారులోనే లైంగిక వేధింపులకు గురిచేసిన దుండగులు.. తర్వాత అక్కడినుంచి పారిపోయారు.

నటి కిడ్నాప్‌, లైంగిక దాడి కేసులో పది మందిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో దిలీప్ కూడా ఒకరు. 2017 జులైలో అరెస్టయిన దిలీప్‌.. నాలుగు నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు.

ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని దిలీప్ మొదటినుంచి వాదిస్తున్నాడు. పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించడమే కాకుండా.. సీబీఐ దర్యాప్తుకి కూడా దిలీప్‌ డిమాండ్ చేశాడు. అయితే ఆయన అభ్యర్థన తిరస్కరణకు గురైంది.

అయితే ఇన్నేళ్ళకు ఈ కేసులో దిలీప్‌ ను ఎర్నాకుళం కోర్టు నిర్దోషిగా తేల్చింది. తాజా కోర్టు తీర్పుపై దిలీప్ స్పందించాడు. ఇది తనపై జరిగిన కుట్ర అని, ఇన్నేళ్ళుగా తనకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.