English | Telugu

షాకింగ్.. కేజీఎఫ్ నటుడు కన్నుమూత!

కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కేజీఎఫ్ నటుడు హరీష్ రాయ్ కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన.. నేడు(గురువారం) తుదిశ్వాస విడిచారు. (Harish Rai)

1995 లో వచ్చిన కన్నడ కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ 'ఓం'లో డాన్ రాయ్ గా మంచి గుర్తింపు పొందారు హరీష్ రాయ్. ఇక 'కేజీఎఫ్'లో ఆయన పోషించిన ఖాసీం చాచా పాత్ర పాన్ ఇండియా ప్రేక్షకులను చేరువ చేసింది.

హరీష్ రాయ్ కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. తనను ఆదుకోవాలని హరీష్ కోరగా.. కొందరు కన్నడ సినీ ప్రముఖులు ముందుకొచ్చి, తోచిన సాయం చేశారు.

చికిత్స తీసుకున్నప్పటికీ హరీష్ ఆరోగ్యం మెరుగు పడలేదు. క్యాన్సర్ మహమ్మారి ఆయనను మింగేసింది. హరీష్ రాయ్ మృతి వార్త తెలిసి.. సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.