English | Telugu

విజయ్ దేవరకొండతో కస్తూరి ఐటెం సాంగ్

ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. ఇక ఆయనకు కస్తూరి కూడా మంచి ఫ్యాన్. ఆమె ఆయన గురించి ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు. "మీకు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి విజయ్ దేవరకొండ గారికి సిస్టర్ గా నటించమంటే నటిస్తారా" అంటూ హోస్ట్ అడిగింది. "నేను ఇలా చెప్తాను. విజయ్ దేవరకొండ గారికి సిస్టర్ గా కాకుండా వేరే రోల్ వస్తే ఈ రెమ్యూనరేషన్ తక్కువ తీసుకుంటా. విజయ్ తో నేను సిస్టర్ గా ఎందుకు చేయాలి ? జోడిగా చేయాలనీ అనుకోలేదు. ఒక వేళా వస్తే ఫటకాగా ఒక ఐటెం సాంగ్ చేయడానికి కూడా రెడీ." అని చెప్పింది . ఇక హోస్ట్ ఐతే "ఒకవేళ మీ హజ్బెండ్ వచ్చి విజయ్ దేవరకొండను బ్రో అని పిలవమంటే పిలుస్తారా" అని అడిగింది.

"నేనేం చేయాలనుంది. నేను భారతీయ నారి ఐపోయాను. మొగుడుకు మించిన మాట లేదు. బ్రో అని పిలుస్తాను. ఆయన ఒక యాక్టర్ గా నాకు బాగా ఇష్టం. నాకు నా కూతురికి కూడా విజయ్ దేవరకొండ అంటే ఇష్టం. నా వల్లే మా అమ్మాయికి కూడా అతనంటే ఇష్టం. గీత గోవిందం పట్టు బట్టి చూపించాను. అర్జున్ రెడ్డి చూపించలేదు. కాంతారా చూపించాను. అమెరికాలో ఇప్పుడు కాంతారా క్లబ్ అనేది ఏర్పాటయింది. నా కూతురు మంచి డాన్సర్. భరతనాట్యం, బాలీవుడ్, హిప్ హాప్ అన్ని చేస్తుంది. అక్కడ బాలీవుడ్ నైట్ అని కండక్ట్ చేస్తారు. అందులో ఎప్పుడూ హిందీ హిట్స్ తీసుకుని వాటికే డాన్స్ చేస్తారు. కానీ కొన్నేళ్లుగా తెలుగు హిట్స్ వస్తున్నాయి. దానికి స్టార్టింగ్ ఎక్కడ అంటే "ఊ అంటావా ఊహూ అంటా" నుంచి మొదలయ్యింది. అలా తెలుగు మ్యూజిక్ అంటే అమెరికన్ స్కూల్స్, కాలేజెస్ లోకి వెళ్తోంది. తమిళ్ సాంగ్స్ గురించి అడగక్కర్లేదు. ఏఆర్ రెహ్మాన్, ఇళయరాజా గారు ఉన్నప్పుడు ఇక అక్కడ తమిళ్ సాంగ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు." అని చెప్పింది కస్తూరి.