English | Telugu

ప్రముఖ దర్శకుడు, అతని భార్య దారుణ హత్య.. ఎవరు ఆ కిల్లర్!

చంపింది ఎవరు!
ఎందు కోసం చంపారు!
దర్శకుడిగా ఎన్నో హిట్ మూవీస్
నటుడుగా కూడా సుదీర్ఘ ప్రయాణం

తండ్రి వారసత్వంతో సినీ రంగంలోకి ప్రవేశించి సదరు వారసత్వాన్ని బలంగా చాటి చెప్పే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వాళ్ళల్లో 'రాబ్ రీనర్' కూడా ఒకరు. ఐదు దశాబ్దాలుగా హాలీవుడ్ సెల్యులాయిడ్ పై తనదైన ముద్ర వేసి హాలీవుడ్ ప్రేక్షకులకే కాకుండా ప్రపంచ సినీ ప్రేమికులకి ఇష్టమైన దర్శకుడిగా మారారు. దిస్ ఈజ్ స్పైనల్ టాప్, స్టాండ్ బై మీ, ది ప్రిన్సెస్ బ్రైడ్, ఏ ఫ్యూ గుడ్ మెన్, ది అమెరికన్ ప్రెసిడెంట్, రూమర్ హాజ్ ఇట్, ఆల్బర్ట్ బ్రోక్స్ వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ.


నిన్న రాబ్ రీనర్ 'లాస్ ఏంజెల్స్' లో ఉన్న తన నివాసంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఆయనతో పాటు భార్య మైకేల్ సింగర్ కూడా విగత జీవిలా పడి ఉంది. ఈ ఇద్దరు ఒంటిపై కత్తి పోట్లు ఉండటంతో పోలీసులు హత్యకేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త హాలీవుడ్ సినీ సర్కిల్స్ లోనే కాకుండా వరల్డ్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. డెబ్భై ఎనిమిది సంవత్సరాల వయసు గల రాబ్ రీనర్ 1984 లో దర్శకుడిగా పరిచయమయ్యాడు. కానీ దర్శకుడి కంటే ముందే ఇరవై ఏళ్ళ వయసులోనే నటుడుగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో విశిష్టమైన క్యారెక్టర్స్ పోషించాడు. అభిమాన గణం కూడా ఎక్కువే.

also read: అఖండ 2 చూస్తున్న మహిళకి పూనకం.. పూర్తి నిజం ఇదే

ఈ ఏడాది సెప్టెంబర్ 25 న 'ది స్పైనల్ టాప్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన 'ది స్పైనల్ టాప్ 2 ' అనే మాక్యుమెంటరీ కామెడీ ఫిలింలో కనిపించాడు. దర్శకుడు కూడా ఆయనే. విచిత్రం ఏంటంటే దర్శకుడిగా పరిచయమైన మూవీ కూడా స్పైనల్ టాప్ నే. దీంతో మొదటి చిత్రమే ఆఖరి చిత్రంగా మిగలడం అభిమానులని కంట తడి పెట్టిస్తుంది. సుమారు ఇరవై చిత్రాల వరకు దర్శకత్వం వహించిన రాబ్ నిర్మాతగానూ ఎన్నో గోప్ప సినిమాలని నిర్మించాడు. 1971 లో 'పెన్నీ మార్షల్' అనే నటిని వివాహం చేసుకొని 1984 లో విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాతే మైకేల్ ని 1989 లో వివాహం చేసుకున్నాడు. మొత్తం నలుగురు పిల్లలు. ఇక తండ్రి కార్ల్ రినర్ అమెరికన్ సినీ ప్రపంచంలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రైటర్ గా ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించిన లెజండ్రీ సినీ పర్సన్.


సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.