English | Telugu

Akhanda 2: అఖండ 2 చూస్తున్న మహిళకి పూనకం.. పూర్తి నిజం ఇదే

-అఖండ 2 జోరు
-బాలయ్య, శివుడి తాండవంకి భారీ రెస్పాన్స్
-ఆ మహిళ ఎవరు
-ఎక్కడ జరిగింది

ప్రస్తుతం 'అఖండ 2 '(Akhanda 2)మానియాతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా మొత్తం ఊగిపోతోంది. డేవోషనల్ కంటెంట్ కి అన్ని రకాల ఎమోషన్స్ కుదరడంతో పాటు శివస్థుతుడైన అఘోరగా బాలయ్య(Balakrishna)తన నట విశ్వరూపాన్ని చూపించడంతో అభిమానులేకాకుండా ప్రేక్షకలోకం మొత్తం అఖండ కి దాసోహమయ్యింది. ఎంతలా అంటే మూవీలో ని చాలా సీన్స్ చాలా మందికి ఫేవరేట్ గా నిలవడమే కాకుండా సదరు సీన్స్ గురించి చాలా గర్వంగా తమకి తెలిసిన వాళ్ళకి చెప్తున్నారు. రిపీట్ ఆడియెన్సు కూడా పెద్ద సంఖ్యలోనే థియేటర్స్ లో దర్శనమిస్తున్నారు. బాలయ్యకి తోడుగా పరమేశ్వరుడు, థమన్ కలవడంతో కొంత మంది ఆడవాళ్ళకైతే థియేటర్స్ లోనే పూనకాలు కూడా వస్తున్నాయి.


ఇందుకు నిదర్శనంగా ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)ప్రకాశం జిల్లా ఒంగోలు(Ongole)లోని ఒక మహిళ తన భర్త తో కలిసి అఖండ 2 చూడటానికి వెళ్ళింది. క్లైమాక్స్ సీన్ లో శివుడు, అఖండ తాండవం ఆడే సీన్‌ని చూస్తూ సదరు మహిళ ఆ ఇద్దరికి దండం పెడుతూ చేతులు ఊపుతూ, శరీరాన్ని కదిలిస్తూ పూనకంతో ఊగిపోయింది. దీంతో పక్కనే ఉన్న ఆమె భర్త అదుపు చేసే ప్రయత్నం చేశాడు. థియేటర్‌లోని ఇతర ప్రేక్షకులు ఆశ్చర్యంతో ఆమెను చూస్తు ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ మారింది. దీన్ని బట్టి మూవీ ప్రారంభం నుండే ప్రేక్షకులు అఖండ కి ఎంతలా కనెక్ట్ అయ్యారో అర్ధం చేసుకోవచ్చు.


ఇక స్క్రీన్‌పై బాలయ్య కనిపించగానే అభిమానులు లేచి నిలబడి విజిల్స్‌, చప్పట్లతో హంగామా చేస్తున్నారు. క్లైమాక్స్‌ దగ్గరయ్యే కొద్దీ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే శివ స్తోత్రాలు అందర్నీ ఊర్రూతలూగిస్తున్నాయి. పూర్తిగా ఆధ్యాత్మిక లోకంలో విహరిస్తున్న అభిప్రాయం కలగడంతో పాటు పిల్లలు, పెద్దలు అంతా మువీని ఎంజాయ్‌ చేస్తున్నారు. కొత్త మంది అభిమానులైతే థియేటర్‌ల వద్ద ఏకంగా పూజలు, అభిషేకాలు కూడా చేస్తున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా మూడు రోజులకే 100 కోట్ల గ్రాస్ క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య రికార్డు కలెక్షన్స్ సాధించడం పక్కా.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.