English | Telugu
మహేష్ కి తండ్రిగా లెజండ్రీ యాక్టర్ ! రాముడు కదా ఫ్యాన్స్ ఏమంటారో మరి
Updated : Dec 15, 2025
-ఆయన ఓకేనా!
-వారణాసి అప్ డేట్ ఏంటి
-ఫ్యాన్స్ ఏమంటారు
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu),దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli)అభిమానులే కాకుండా ప్రపంచ సినీ ప్రేమికులు మొత్తం 'వారణాసి'(Varanasi) ఎప్పుడెప్పుడు షూటింగ్ పూర్తి చేసుకొని తమ ముందుకు వస్తుందా అని ఎదురుచూస్తూ వస్తున్నారు. దీంతో నిత్యం వారణాసి అప్ డేట్స్ గురించి సెర్చ్ చేయడం వాళ్ళ నిత్యదినచర్యల్లో ఒక భాగమైపోయింది.ఈ క్రమంలోనే వారణాసి కాస్టింగ్ కి సంబంధించి నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒక న్యూస్ వాళ్ళల్లో ఆనందాన్ని నింపుతుంది.
అంతలా వాళ్ళల్లో ఆనందాన్ని నింపడానికి కారణం వారణాసిలో లెజండ్రీ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj)నటిస్తూ ఉండటమే. అవును వారణాసిలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో చేస్తున్నాడని, సదరు క్యారక్టర్ మహేష్ తండ్రి క్యారక్టర్ అని కూడా అంటున్నారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఎందుకంటే ఈ ఇద్దరిది చాలా పెద్ద హిట్ కాంబో. ఎక్కువ శాతం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా తండ్రి కొడుకులుగా చేసిన దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఎంత పెద్ద విజయాన్ని అందుకున్నాయో తెలిసిందే. వారణాసి చిత్ర యూనిట్ ప్రకాష్ రాజ్ చేస్తున్న విషయాన్నీ త్వరలోనే అధికారకంగా ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Also read: ప్రముఖ దర్శకుడు, అతని భార్య దారుణ హత్య.. ఎవరు ఆ కిల్లర్!
ఇక ఈ న్యూస్ పై సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తు ప్రకాష్ రాజ్ లాంటి ఆర్టిస్టుని మహేష్ తండ్రిగా ఎంచుకున్నారంటే ఖచ్చితంగా సిల్వర్ స్క్రీన్ పై వండర్ ని సృష్టించే క్యారక్టరే అయ్యి ఉంటుంది. పైగా ప్రకాష్ రాజ్ కూడా తన క్యారక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటేనే ఒప్పుకుంటాడు. ఆల్రెడీ మహేష్ బాబు రాముడిగా కనిపిస్తాడని రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ప్రకాష్ రాజ్ క్యారక్టర్ తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి ఏర్పడిందని అంటున్నారు. ఇక వారణాసి ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా ప్రియాంక చోప్రా(Priyanka Chopra) మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. 2027 వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టనుంది.