English | Telugu

ప్రముఖ దర్శకుడి హఠాన్మరణం

-అరిగేల కొండలరావు మృతి
-పెళ్లి కోసంతో దర్శకుడు
-పలువురు నివాళి

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో దర్శక శిఖరం భువి నుంచి దివికి ఏగింది. దాసరి అరుణ్ కుమార్, సాయికిరణ్, సంజనా గిలార్నీ, కీర్తి చావ్లా జంటగా నటించిన చిత్రం పెళ్లి కోసం(Pelli KOsam). చంద్రమోహన్, కోటా శ్రీనివాసరావు, జయప్రకాశ్ రెడ్డి వంటి లెజెండ్రీ యాక్టర్స్ కూడా కీలకమైన క్యారెక్టర్స్ లో కనిపించారు. ఈ చిత్ర దర్శకుడు అరిగేల కొండలరావు(Arigela KOndal Rao)నే భువి నుంచి దివికి పయనించడం జరిగింది.


నిన్న స్వర్గస్తులవ్వగా మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. ఫిలిం సర్కిల్స్ లో మాత్రం అనారోగ్య కారణాల వల్లనే మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు మాత్రం మరణించిన విషయాన్నీ అధికారంగా వెల్లడి చేసాయి. కొండలరావు సుదీర్ఘ కాలం నుంచి చిత్ర పరిశ్రమలో ఉంటు దర్సకత్వానికి సంబంధించిన పలు శాఖల్లో పని చేస్తూ పెళ్లి కోసం తో దర్శకుడుగా మారారు. 2006 సెప్టెంబర్ 1 న ప్రేమ కోసం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

also read: అఖండ 2 చూసిన యోగి ఆదిత్యనాద్.. రిపోర్ట్ ఇదే

ఇక కొండలరావు మృతి పట్ల దర్శక సంఘ సభ్యులతో పాటు ఫిలిం ఛాంబర్ తమ సంతాపాన్ని తెలియచేసింది.