English | Telugu
ఈ నెల 28 న ఏం జరగబోతుంది! లవ్ సింబల్ స్క్రీన్ షాట్ వైరల్
Updated : Nov 24, 2025
-ధనుష్, మృణాల్ పోస్ట్ లు వైరల్
-ఈ నెల 28 న సక్సెస్ కొడతాడా!
-ఇద్దరు కలిసి నటించాలని అభిమానుల కోరిక
పాన్ ఇండియా ప్రేక్షకులని తమ పెర్ఫార్మెన్సు తో అలరిస్తూ వస్తున్న పాన్ ఇండియా స్టార్స్ ధనుష్(Dhanush),మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). ఈ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారనే వార్తలు ఎప్పట్నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నప్పటికీ డేటింగ్ విషయాన్నీ ఆ ఇద్దరు అధికారంగా చెప్పిన దాఖలాలు లేవు. కాకపోతే డేటింగ్ లో ఉన్నారనే వార్తలకి బలాన్ని చేకూర్చేలా ఇద్దరు కలిసి కొన్ని ఫంక్షన్స్ కి హాజరవ్వడం జరుగుతుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఈ ఇద్దరి రిలేషన్ హాట్ టాపిక్ గా మారింది.
అందుకు ప్రధానంగా నిలిచింది 'ధో ధీవానే షెహర్ మే'(Do Deewane Shaher Mein)అనే కొత్త చిత్రం. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ నే హీరోయిన్. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మృణాల్ సదరు టీజర్ ని ఇనిస్టా వేదికగా పోస్ట్ చేసింది. సదరు పోస్ట్ కి టీజర్ చాలా బాగుందని ధనుష్ కామెంట్ చేసాడు. ఆ కామెంట్ కి మృణాల్ లవ్ సింబల్ తో రిప్లై ఇచ్చింది. ఇప్పుడు ఈ లవ్ సింబల్ రిప్లై నే హాట్ టాపిక్ గా మారడంతో పాటు, ఇరువురి రిప్లై ల స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
also read: ప్రముఖ దర్శకుడి హఠాన్మరణం
ధనుష్, మృణాల్ కలిసి ఇంతవరకు ఎలాంటి చిత్రంలో కనిపించలేదు. అభిమానులైతే ఆ ఇద్దరు జోడిగా నటించాలని కోరుకుంటున్నారు. ప్రస్థుతానికి ఈ ఇద్దరు తమ కొత్త చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రీవియస్ మూవీ ఇడ్లీ కొట్టు తర్వాత ధనుష్ 'తేరే ఇష్క్ మెన్ 'అనే హిందీ మూవీతో సోలో హీరోగా ఈ నెల 28 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ధనుష్ చేస్తున్న నాలుగోవ హిందీ మూవీ ఇది. మొదటి మూడు చిత్రాలు పెద్దగా ప్రేక్షాదరణకి నోచుకోకపోవడంతో 'తేరే ఇష్క్ మెన్'(Tere Ishk Mein)ఫలితంపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. కృతి సనన్(kriti sanon)హీరోయిన్. ఇక మృణాళి చేస్తున్న 'ధో ధీవానే షెహర్ మే' ఫిబ్రవరి 20 న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా సిద్దార్ధ్ చతుర్వేది హీరో.