English | Telugu
ఇదెక్కడి మాస్ రా మావ.. రామ్-బోయపాటి మాస్ ట్రీట్!
Updated : May 15, 2023
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. రామ్, బోయపాటి మొదటిసారి చేతులు కలిపిన ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది.
రామ్ పుట్టినరోజు(మే 15) కానుకగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ థండర్ పేరుతో ప్రత్యేక వీడియోని విడుదల చేశారు. "నీ స్టేట్ దాటలేనన్నావ్ దాటా.. నీ గేట్ దాటలేనన్నావ్ దాటా.. నీ పవర్ దాటలేనన్నావ్ దాటా.. ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్సు" అంటూ రామ్ ఊరమాస్ అవతార్ లో అదరగొట్టాడు. రామ్ స్క్రీన్ ప్రజెన్స్, అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో వీడియో ఆకట్టుకుంటోంది. థమన్ బీజీఎం కూడా అదిరింది. మొత్తానికి రామ్ ని బోయపాటి నెవర్ బిఫోర్ మాస్ అవతార్ లో చూపించబోతున్నాడని ఫస్ట్ థండర్ తోనే అర్థమైపోతోంది.
ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్ కి, బోయపాటికి ఇదే మొదటి పాన్ ఇండియా ఫిల్మ్. మరి ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.