English | Telugu

'జాతిరత్నాలు' దర్శకుడితో మాస్ రాజా!

'జాతిరత్నాలు' సినిమాతో దర్శకుడు కె.వి. అనుదీప్ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. నిజానికి అది అతనికి రెండో సినిమా. ఆయన 'పిట్టగోడ' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. కానీ ఆ సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. ఆ తర్వాత 'జాతిరత్నాలు'తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ తీసి, ఘన విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. అనంతరం 'ప్రిన్స్'తో నిరాశపరిచిన అనుదీప్.. ఇప్పుడు దర్శకుడిగా తన మూడో సినిమాని మాస్ మహారాజ రవితేజతో చేయబోతున్నట్లు తెలుస్తోంది.

రవితేజ కామెడీ టైమింగ్, ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తేనే సందడిగా ఉంటుంది. అలాంటి రవితేజ, అనుదీప్ తో చేతులు కలిపితే కామెడీ పీక్స్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. రవితేజ ప్రస్తుతం 'టైగర్ నాగేశ్వరరావు', 'ఈగల్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాల తర్వాత ఆయన చేయబోయేది అనుదీప్ సినిమానేనని సమాచారం. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రంలో త్రిష, తమన్నా హీరోయిన్లుగా నటించే అవకాశముందట.