English | Telugu
బాహుబలి ఎపిక్ ప్రమోషన్స్ కి అనుష్క డుమ్మా..రెమ్యునరేషన్ ఎంత అడిగింది
Updated : Oct 30, 2025
- బాహుబలి ఎపిక్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
- ప్రమోషన్స్ కి అనుష్క ఎందుకు రాలేదు
- ప్రభాస్, రాజమౌళి, రానా ఏం చెప్తున్నారు
- అనుష్క రెమ్యునరేషన్ ఎంత!
హీరోలకి అభిమానులు వీరాభిమానులు ఉండటం కామన్. కానీ సిల్వర్ స్క్రీన్ పై ప్రత్యక్షమయ్యే సినిమాకి కూడా ఆ రెండు క్యాటగిరీస్ కి చెందిన వారు ఉంటారని కొన్ని చిత్రాలు నిరూపిస్తుంటాయి. పైగా అందులోని క్యారెక్టర్స్ ని అభిమానులు, ప్రేక్షకులు తమ సొంత వాళ్ళ లాగా భావిస్తారు. అలాంటి ఒక చిత్రమే బాహుబలి(Baahubali). రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ, ఈ నెల 31 న బాహుబలి ది ఎపిక్ (Baahubali The Epic)గా వరల్డ్ వైడ్ గా అడుగుపెట్టనుంది. ప్రీమియర్స్ కూడా ఈ రోజు సాయంత్రం నుంచే పడటంతో అభిమానుల ఆనందానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు.
రిలీజ్ సందర్భంగా రాజమౌళి(SS Rajamouli)ప్రభాస్(Prabhas),రానా(Rana)లు ప్రమోషన్స్ లో పాల్గొంటు పార్ట్ 1 , పార్ట్ 2 తో పాటు ఎపిక్ కి సంబంధించిన పలు విషయాల గురించి చెప్తున్నారు. ఆ ముగ్గురు మాటలు అభిమానులల్తో పాటు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అనుష్క(Anushka)గురించి కూడా ప్రస్తావనకి వస్తుంది. దీంతో అనుష్క ఎందుకు ప్రమోషన్స్ లో పాల్గొనలేదనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. అనుష్క కొంత కాలంగా తాను చేసిన చిత్రాల విషయంలో ప్రమోషన్స్ కి దూరంగా ఉంటూ వస్తుంది. ఆ విధంగా ఎందుకు చేస్తున్నానే విషయం అందరికి నేనే చెప్తానని ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా తెలియచేసింది. రీసెంట్ గా తానే ప్రధాన పాత్రలో వచ్చిన 'ఘాటీ' ప్రమోషన్స్ లో కూడా అనుష్క పాల్గొనలేదు.
Also Read:ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఎవరు విన్నర్
బాహుబలి రెండు బాగాలకి అనుష్క ఎంత ప్లస్ నో తెలిసిందే. దేవసేన గా రెండు పార్శ్యాలు ఉన్న క్యారక్టర్ లో విజృంభించి నటించడంతో పాటు సినిమా ఘన విజయంలో కూడా భాగమైంది. అసలు దేవసేన క్యారక్టర్ లో అనుష్క ని తప్ప మరొకర్ని ఉహించుకోలేం. అంతలా తన నటనతో మెస్మరైజ్ చేసింది. తన క్యారక్టర్ కి సంబంధించి అనుష్క పడిన కష్టం కూడా ఎంతో. దీంతో ఎపిక్ సందడి వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో అసలు అనుష్క బాహుబలి రెండు బాగాలకి ఎంత ఎంత రెమ్యునరేషన్ అడిగింది, మేకర్స్ ఆమె అడిగిన మొత్తం ఇచ్చారా అనే చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానుల్లో జరుగుతుంది.