English | Telugu

రెండో పెళ్లి కూడా పెటాకులేనా! పాపం ఆ డైరెక్టర్!

-విడాకులు నిజమేనా!
-అసలు ఏం జరుగుతుంది
- ఆ ఇద్దరు క్లారిటీ ఇస్తారా!

భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతమైన దర్శకుల గురించి చెప్పుకుంటే అందులో ఖచ్చితంగా 'సెల్వ రాఘవన్'(Selvaraghavan)ఉంటాడు. 7 /జి బృందావన కాలనీ, యుగానికి ఒక్కడు, ఆడవారి మాటలకి అర్దాలు వేరులే, మయక్కం ఎన్నా, నెంజమ్ మరప్పతిల్లై వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ప్రతిభావంతమైన నటుల గురించి చెప్పుకోవాలన్నా అందులో సెల్వ రాఘవన్ పేరు ఉంటుంది. బీస్ట్, సాని కాయిధ‌మ్, నానే వరువేన్, బకాసురన్, మార్క్ ఆంటోనీ, రాయన్ తో పాటు రీసెంట్ గా వచ్చిన ఆర్యన్ వంటి చిత్రాలే ఉదాహరణ.


సెల్వ రాఘవన్ 2011 వ సంవత్సరంలో ప్రముఖ దర్శకురాలు 'గీతాంజలి'(Gitanjali)ని వివాహం చేసుకున్నాడు. సెల్వ రాఘవన్ కి ఇది రెండో వివాహం. మొదటి వివాహం ప్రముఖ హీరోయిన్ 7 /జి బృందావన కాలనీ ఫేమ్ సోనియా అగర్వాల్(Sonia Agarwal)తో జరిగింది. ఆ ఇద్దరిది ప్రేమ వివాహం. 2006లో వీరి పెళ్లి జరగగా మనస్పర్థలు తలెత్తడంతో 2010లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాతనే గీతాంజలి ని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా విడాకులు తీసుకోబోతున్నారనే న్యూస్ ఒకటి తమిళ ఫిలిం సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Also read: సుజిత్ కి పవన్ కళ్యాణ్ కారు గిఫ్ట్.. ఎన్ని కోట్లో తెలుసా

ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం గీతాంజలి ఇనిస్టాగ్రమ్ లో భర్తతో దిగిన ఫొటోలన్నింటినీ డిలీట్ చేయడమే. పెళ్లయిన 14 ఏళ్లకి అలా ఉన్నట్లుండి పిక్స్ డిలేట్ చేయడంతోనే ఆ ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయనే మాటలు వినపడుతున్నాయి. మరి ఈ విషయంపై ఆ ఇద్దరిలో ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.