English | Telugu

'జిందగీ ఇన్ టూ షేడ్స్' డాక్యుమెంటరీపై తెలంగాణ మంత్రి అజారుద్దీన్ ప్రశంసలు!

"ఇఫ్తేకర్ షరీఫ్" జీవితం ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ “జిందగీ ఇన్ టూ షేడ్స్” హైదరాబాద్‌లో ప్రీమియర్‌ అయింది. ఈ ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి, అతిథుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ కార్యక్రమానికి వచ్చిన మాజీ భారత క్రికెటర్, తెలంగాణ మైనారిటీ వ్యవహారాల మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ సినిమా చూసి ప్రశంసించారు. నిజ జీవిత కథను చాలా నిజాయితీగా, సింపుల్‌గా చూపించారని, ఇందులో మంచి సామాజిక సందేశం ఉందని అన్నారు. డాలి టోమర్ నుంచి ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరారు. ఫిల్మ్ మేకర్ గా ఆమెకు ఉజ్వల భవిష్యత్ ఉందని కొనియాడారు.

ఈ డాక్యుమెంటరీని ముంబయికి చెందిన ఓమ్‌షీల్ ప్రొడక్షన్స్ (డాలీ టోమర్) నిర్మించగా, అమెరికాలోని డీకే ఒమ్‌షీల్ ప్రొడక్షన్స్ (ఖుర్రం సయ్యద్) సహకరించింది. సినిమాకు దర్శకత్వం రజనీష్ దూబే, నిర్మాణం కల్పనా రాజ్‌పుత్, ఎడిటింగ్ దేవు నామ్‌దేవ్ చేశారు.

“జిందగీ ఇన్ టూ షేడ్స్” మన జీవితాల్లో ఎదురయ్యే నిజాల్ని సూటిగా చూపించే డాక్యుమెంటరీ. ఇప్పటికే ఇది అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ ఈ ఈవెంట్ ను కోఆర్డినేట్ చేశారు.

మొత్తానికి, మంచి కంటెంట్‌తో, మంచి సందేశంతో “జిందగీ ఇన్ టూ షేడ్స్” ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకుంటోంది.