English | Telugu

యానిమల్ ఇక టీవీల్లో..కాకపోతే అందులోనే 

ఫ్యూచర్ లో ఎవరినైనా 2023 డిసెంబర్ నెల ప్రత్యేకత ఏంటి అని అడిగితే అందరు యానిమల్ మూవీ అని చెప్తారు. అంతలా ఇండియా మొత్తం ప్రభావం చూపించింది.రణబీర్ కపూర్ పవర్ ఫుల్ నటనకి రష్మిక అందచందాలు, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం తోడవ్వడంతో పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు కూడా సృష్టించింది.లేటెస్ట్ గా చాలా రోజులకి యానిమల్ వార్తల్లోకి ఎక్కింది.

యానిమల్ మూవీ థియేటర్స్ లో ఎంతటి విజయాన్ని సృష్టించిందో ఓటిటి ప్లాట్ ఫామ్స్ ల్లో కూడా అంతే విజయాన్ని సాధించింది.ఇప్పుడు ఈ మూవీ మరో సంచలనానికి దారి తీయ్యబోతుంది. మార్చి 17, 2024న సాయంత్రం 7 గంటలకు సోనీ మాక్స్ ఛానెల్‌లో ప్రసారం కాబోతుంది. ఇప్పుడు ఈ వార్త టెలివిజన్ ప్రేమికులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
కాకపోతే కేవలం హిందీ వెర్షన్ లో మాత్రమే అందుబాటులోకి వస్తుంది. మరి బుల్లితెర ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి
.
తండ్రి ని చావు నుంచి తప్పించడానికి ఒక కొడుకు ఏం చేసాడు అనేదే యానిమల్ కథ. బాబీ డియోల్, త్రిప్తి డిమ్రీ, అనిల్ కపూర్ లు కీలక పాత్రల్లో నటించారు. టి సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ కలిసి అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఇండియాలోనే అత్యధిక కలెక్షన్స్ ని సాధించిన టాప్ టెన్ మూవీస్ లో ఒకటిగా కూడా యానిమల్ నిలిచింది