English | Telugu

Akhanda 2: బాలయ్య తాండవానికి యూట్యూబ్ షేక్!

పది రోజుల్లో అఖండ-2 తాండవం
రోజురోజుకి పెరిగిపోతున్న అంచనాలు
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సాంగ్స్, ట్రైలర్

టాలీవుడ్ నుండి త్వరలో విడుదల కానున్న మోస్ట్ హైప్డ్ సినిమాలలో 'అఖండ-2' ముందు వరుసలో ఉంటుంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో డిసెంబర్ 5న రానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా అఖండ-2 ఫీవర్ కనిపిస్తోంది. (Akhanda 2 Thaandavam)

అసలే బాలయ్య-బోయపాటి కాంబో, దానికితోడు అఖండ సీక్వెల్ కావడంతో.. 'అఖండ-2'పై అంచనాలు వేరే లెవెల్ లో ఉన్నాయి. అందుకు శాంపిల్ అన్నట్టుగా.. సాంగ్స్, ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ తో పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో ఇవి ట్రెండింగ్ లో ఉన్నాయి.

అఖండ-2 నుండి ఫస్ట్ సింగిల్ గా 'తాండవం' సాంగ్ నవంబర్ 14న విడుదలైంది. ఇప్పటికే 12 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించిన ఈ సాంగ్.. యూట్యూబ్ మ్యూజిక్ లో టాప్-11 లో ట్రెండ్ అవుతోంది.

సెకండ్ సింగిల్ గా 'జాజికాయ' సాంగ్ నవంబర్ 18న విడుదల కాగా, ఇప్పటికే 10 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించింది. అంతేకాదు, యూట్యూబ్ మ్యూజిక్ లో టాప్-5 లో ట్రెండ్ అవుతోంది.

Also Read: మహేష్ 'వారణాసి'లో ఎన్టీఆర్ కొడుకు భార్గవ్ రామ్!

ఇక అఖండ-2 ట్రైలర్ నవంబర్ 21న రిలీజ్ అయింది. అన్ని వర్గాల నుండి సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ట్రైలర్.. ఇప్పటికే 22 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించి, ట్రెండింగ్ లో ఉంది.

సరిగ్గా మరో పదిరోజుల్లో డిసెంబర్ 5న అఖండ-2 తాండవం మొదలు కానుంది. విడుదలకు ముందే ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్న ఈ చిత్రం.. విడుదల తర్వాత ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.