English | Telugu

ఏమైంది చిరు.. ఎందుకు అప్ డేట్ ఇవ్వడం లేదు 

-సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్న ఫ్యాన్స్
-మెగా కోలాహాలం
-విశ్వంభర ఎప్పుడు
-మన శంకర వర ప్రసాద్ గారు ఏం చేస్తున్నారు

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)సినిమా రిలీజ్ రోజు థియేటర్స్ దగ్గర ఏర్పడే పండుగ వాతావరణం తెలిసిందే. ఆ రోజు మూవీ లవర్స్ ఎవరో అభిమానులు ఎవరో తెలుసుకోవడం కష్టం. అంతలా థియేటర్స్ దగ్గర మెగా జాతర జరుగుతుంది. అసలు సినిమా రిలీజ్ రోజే కాదు. మెగాస్టార్ కొత్త సినిమాకి సంబంధించిన న్యూస్ వచ్చినా చాలు అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. నాలుగు దశాబ్దాలాగా ఇదే తంతు.


మెగాస్టార్ ప్రస్తుతం అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకత్వంలో 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)తో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటంతో పాటు వరప్రసాద్ గారు రాక కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రం అభిమానులు నిరాశతో ఉన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు స్పందిస్తు 'మన శంకర వర ప్రసాద్ గారు గురించే అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు.

కానీ మరో అప్ కమింగ్ మూవీ 'విశ్వంభర'(Vishwambhara) గురించి ఎందుకు అప్ డేట్ ఇవ్వడం లేదు. సిజి వర్క్ లేట్ అవ్వడం వలన నెక్స్ట్ ఇయర్ వేసవిలో రిలీజ్ ఉంటుందని చిరంజీవి ప్రకటించారు. కానీ అప్పటి వరకు మూవీకి సంబంధించిన ప్రమోషన్ ని ఏదో ఒక రూపాన ఇస్తూ ఉండాలి. ఆ విధంగా చేస్తుండటం వలన విశ్వంభర ప్రేక్షకులకి దగ్గరగానే ఉంటుందని సోషల్ మీడియా వేదికగా అభిమానులు కోరుతున్నారు.


also read:అఖండ 2 చూడటానికి ఎంత మంది అఘోరాలు వస్తున్నారు! ఆ ఏరియా నుంచి ఎంత

సోషియో ఫాంటసీ గా తెరకెక్కుతున్న విశ్వంభర షూటింగ్ రెండు సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన సినిమా. గేమ్ చెంజర్ కోసం వాయిదా పడినా ఈ సంవత్సరం లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని అనుకున్నారు. కానీ వాయిదా పడి నెక్స్ట్ ఇయర్ వేసవికి రానుంది. అందుకే అభిమానులు విశ్వంభర అప్ డేట్స్ ఇస్తుండమని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. చిరంజీవి సరసన త్రిష, ఆషిక రంగనాధ్, సుర్బి పురానిక్ హీరోయిన్స్ గా చేస్తుండగా బింబి సార ఫేమ్ వశిష్ఠ(Vasishta)దర్శకుడు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.