English | Telugu
నా భర్త ఒక నార్సిసిస్ట్.. 50 కోట్లు ఇప్పించాలని ప్రముఖ హీరోయిన్ డిమాండ్
Updated : Nov 25, 2025
-గృహ హింస కేసు నమోదు చేసిన సెలీనా జైట్లీ
-సెలీనా జైట్లీ ఎవరు
-తెలుగు సినిమాలో చేసిందా
-తన డిమాండ్ ఏంటి!
మంచు విష్ణు(Manchu Vishnu)నుంచి వచ్చిన అనేక సినిమాల్లో సూర్యం కూడా ఒకటి. ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భారతీయ నటి 'సెలీనా జైట్లీ'(Celina jaitly). తొలి చిత్రంతోనే అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో అలరించింది.ఇతర భాషల్లోను సత్తా చాటిన సెలీనా 2011 లో ఆస్ట్రియా దేశానికి చెందిన 'పీటర్ హాగ్'(Peter Haag)అనే వ్యాపార వేత్త ని పెళ్లి చేసుకుంది. ఆ ఇద్దరికి ముగ్గురు పిల్లలు.
రీసెంట్ గా సెలీనా ముంబై లోని జ్యుడిషియల్ మెజిస్రేట్ లో పీటర్ పై గృహ హింస ఆరోపణలు చేస్తు పిటిషన్ దాఖలు చేసింది. సదరు పిటిషన్ లో నా భర్త తనని తాను ఎక్కువగా ఊహించుకొనే ఒక నార్సిసిస్ట్. పిల్లలపై ప్రేమ కూడా లేని ఒక సెల్ఫీస్ట్. శారీరకంగా, మానసికంగా నన్ను లైంగిక వేధింపులకి గురి చేసాడు.ఆస్ట్రియాలో విడాకులకి అప్ప్లై చేయడంతో ఇండియాకి పారిపోయి వచ్చాను.పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితాన్ని ఎంతో కోల్పోయాను.
నా వర్క్ నన్ను చేసుకోనివ్వకుండా ఏదో ఒక రకంగా అడ్డుపడ్డాడు. దాంతో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయాను. పీటర్ నుంచి నెలకి 10 లక్షల రూపాయల భరణంతో పాటు 50 కోట్లు నష్టపరిహారం ఇప్పించాలి. నా పిల్లలు నా దగ్గరకి వచ్చేలా కూడా చూడాలని సెలీనా తన పిటిషన్ లో పేర్కొంది. వచ్చే నెల డిసెంబర్ 12 కి కోర్టు కేసుని వాయిదా వేసింది.
Also read: ఏమైంది చిరు.. ఎందుకు అప్ డేట్ ఇవ్వడం లేదు
హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాకి చెందిన సెలీనా 2003 లో హిందీ సినీ రంగ ప్రవేశం చేసి అనతి కాలంలోనే అగ్ర హీరోలతో జత కట్టింది. వివాహం తర్వాత పెద్దగా సినిమాలు చెయ్యలేదు. 2020 లో సీజన్స్ గ్రీటింగ్స్ అనే షార్ట్ ఫిలింలో కనపడింది. 2001 ఫెమినా మిస్ ఇండియాగా నిలవడమే కాకుండా అదే సంవత్సరం మిస్ యూనివర్స్ పోటీల్లో నాలుగో రన్నర్ అప్ గా నిలిచిన రికార్డు సెలీనా సొంతం.