అఖండ-2.. పక్కా ప్లానింగ్ తో పాన్ ఇండియా తాండవం!
on Nov 11, 2025

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో 'అఖండ-2' ఒకటి. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న 14 రీల్స్ ప్లస్ నిర్మిసున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. (Akhanda 2 Thandavam)
'అఖండ-2' విడుదలకు ఇంకా మూడు వారాలే ఉండటంతో.. మూవీ టీమ్ భారీ ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తోంది. ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్స్ కి శ్రీకారం చుడుతోంది.
డివోషనల్ టచ్ ఉన్న అఖండ తరహా సినిమాలు పాన్ ఇండియా సక్సెస్ అందుకుంటున్నాయి. ఇదే బాటలో అఖండ-2 కూడా పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. అందుకు తగ్గట్టుగానే పాన్ ఇండియా వైడ్ గా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
'అఖండ-2' మొదటి సాంగ్ ని నవంబర్ 14న ముంబైలో విడుదల చేయనున్నారు. అలాగే, వారణాసిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సన్నాహాలు చేస్తున్నారు. కొచ్చి, బెంగళూరు, చెన్నైలోనూ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారట.
Also Read: ప్రభాస్ 'స్పిరిట్'లో ఆ ఫ్లాప్ తెలుగు హీరో..!
పాన్ ఇండియా వైడ్ గా ప్రమోషన్స్ చేస్తూ.. విడుదలకు ముందు నవంబర్ 29 లేదా 30న తెలుగునాట భారీ ప్రీ రిలీజ్ నిర్వహించబోతున్నారట. ఈ వేడుకకు హైదరాబాద్ లేదా అమరావతి వేదిక కానుందని చెబుతున్నారు.
మొత్తానికి ఈ మూడు వారాలు అఖండ మయం కాబోతుంది. అసలే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రమోషన్స్ తో ఆ అంచనాలు రెట్టింపు అవుతాయి అనడంలో సందేహం లేదు.
ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు.. 'అఖండ-2' ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



