English | Telugu

తగ్గిన 'హరి హర వీరమల్లు' టికెట్ ధరలు..!

తగ్గిన 'హరి హర వీరమల్లు' టికెట్ ధరలు..!

Publish Date:Jul 27, 2025

  టికెట్ ధరల పెంపు అనేది కొన్ని సినిమాలకు వరంలా మారితే, మరికొన్ని సినిమాలకు శాపం అవుతుంది. తాజాగా విడుదలైన 'హరి హర వీరమల్లు' విషయంలోనూ అదే జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ని రాబట్టిన వీరమల్లు.. రెండో రోజు నుంచి ఆ స్థాయి వసూళ్లను రాబట్టలేకపోయింది. దానికి ప్రధాన కారణం.. అధిక టికెట్ ధరల కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ వెనకడుగు వేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన మేకర్స్.. టికెట్ ధరల విషయంలో మనసు మార్చుకున్నారు.   'హరి హర వీరమల్లు' సినిమాకి మొదటి పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. అయితే ఏపీతో పోలిస్తే ఇప్పటికే తెలంగాణలో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఇంకా పెంచడంతో.. అధిక ధరల కారణంగా ఫుట్ ఫాల్స్ పై ప్రభావం పడింది. దీంతో మేకర్స్ టికెట్ రేట్స్ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి టికెట్ ధరలు సాధారణంగా ఉండనున్నాయి. ఇప్పటికే ఆన్ లైన్ లో రెగ్యులర్ టికెట్ రేట్స్ తో బుకింగ్స్ చూపిస్తున్నాయి.    పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'హరి హర వీరమల్లు' జూలై 24న థియేటర్లలో అడుగుపెట్టింది. నేటితో ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ చేరనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రేపటి నుంచి టికెట్ ధరలు సాధారణంగా ఉండటంతో.. ఫుట్ ఫాల్స్ పెరిగే అవకాశముంది అంటున్నారు.  
One/4.. Action Crime Drama Gears Up for September Release

One/4.. Action Crime Drama Gears Up for September Release

Publish Date:Jul 26, 2025

Under the banners of Tejas Gunjal Films and Rohit Gunjal Films, the action-packed crime drama One/4 is ready to hit the big screens this September. The film stars Venkatesh Peddapalem, Aparna Mallik, and Heena Soni in the lead roles. One/4 is directed by Bahubali Palani K, who previously worked as an associate director on the blockbuster “Baahubali.” The project is jointly produced by Ranjan Rajesh Gunjal and Rohit Ramdas Gunjal. Having completed both its shoot and post-production, the first copy of One/4 is now ready. After finishing its censor formalities, the team is preparing for a grand theatrical release in September. Speaking about the film, the director and producers shared, “One/4 is an action crime drama, with the entire shoot taking place in Vizag. Our story revolves around the consequences of a single slip of the tongue, and the struggles that follow. It’s a fresh, engaging narrative packed with thrilling elements and intense crime-action sequences.” They added, “We have already released the teaser and songs on T-Series’ YouTube channel, which received a tremendous response. We promise a unique and crazy experience for the audience and will release the film in September.”

కృష్ణవంశీ తన 30 ఏళ్ళ కెరీర్‌లో 20 సినిమాలే చేయడం వెనుక రీజన్‌ ఇదే!

Publish Date:Jul 27, 2025

  డైరెక్టర్‌గా 30 సంవత్సరాల కెరీర్‌.. చేసిన సినిమాలు 20 మాత్రమే. ఒకే తరహా సినిమాలు చేసే డైరెక్టర్‌ అనే ముద్ర పడకుండా ప్రతి సినిమా విభిన్నంగా ఉండేలా చూసుకునే డైరెక్టర్‌. సినిమా అంటే ప్రజలను ఎంతో కొంత చైతన్య పరిచేదిగా ఉండాలని నమ్మే డైరెక్టర్‌. అతనే కృష్ణవంశీ. తన కెరీర్‌లో చేసిన సినిమాలు ఒకదాన్ని పోలి మరొకటి ఉండదు. చిత్ర పరిశ్రమలో ఇలాంటి డైరెక్టర్లు చాలా అరుదుగా ఉంటారు.  స్టార్స్‌తో సినిమాలు చెయ్యాలని, కమర్షియల్‌ హిట్స్‌ సాధించాలని కృష్ణవంశీ ఏరోజూ అనుకోలేదు. అంతేకాదు, లెక్కకు మించిన సినిమాలు చెయ్యాలన్న ఆలోచన కూడా అతనికి లేదు. ఇంతటి వైవిధ్యమైన ఆలోచనలు ఉన్న కృష్ణవంశీ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, డైరెక్టర్‌గా మారేందుకు ఎలాంటి కృషి చేశారు అనేది తెలుసుకుందాం.   1962 జూలై 28న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించారు కృష్ణవంశీ. అతని అసలు పేరు పసుపులేటి వెంకట బంగార్రాజు. చిన్నతనం నుంచి సినిమాలంటే ఎక్కువ ఆసక్తి చూపించేవారు. ప్రతిరోజూ సినిమాలు చూసేవారు. ఇంటర్మీడియట్‌కి వచ్చిన తర్వాత తను సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తండ్రితో చెప్పారు. కానీ, డిగ్రీ పూర్తి చేసిన తర్వాత చూద్దాం అని తండ్రి చెప్పడంతో కష్టపడి చదివారు. ఆ తర్వాత తండ్రి బలవంతం మీదే పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కూడా చేశారు. అయినా సినిమాల్లోకి వెళ్లడానికి తండ్రి ఒప్పుకోకపోవడంతో ఒకరోజు ఇంటిలో చెప్పకుండా మద్రాస్‌ రైలెక్కేశారు వంశీ. ఆ తర్వాత అతని ఆచూకీ తెలుసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేశారు తండ్రి. సినిమా ఫీల్డ్‌కే వెళతానని వంశీ పట్టు పట్టడంతో ఆయన కూడా ఒప్పుకున్నారు.    తనకు తెలిసిన వారి ద్వారా వంశీని పి.ఎస్‌.ప్రకాష్‌ దగ్గరికి పంపారు తండ్రి. ఇండస్ట్రీకి వెళ్లాలనే ఆలోచనే తప్ప అక్కడ ఏం చెయ్యాలి అనే విషయంలో వంశీకి క్లారిటీ లేదు. కెమెరా డిపార్ట్‌మెంట్‌లో చేస్తానని చెప్పడంతో అతన్ని లైట్‌బోయ్‌గా తీసుకున్నారు. అలా రెండు సంవత్సరాలు పనిచేశారు. అక్కడే బ్రహ్మాజీ పరిచయమయ్యారు. ఆ సమయంలోనే రామ్‌గోపాల్‌వర్మ శివ సినిమా చేస్తున్నారని తెలుసుకొని ఆయన దగ్గర దర్శకత్వ శాఖలో చేరారు వంశీ. చాలా తక్కువ సమయంలోనే వర్మకు బాగా దగ్గరయ్యారు. శివ తర్వాత వర్మ చేసిన చాలా సినిమాలకు కృష్ణవంశీ అసోసియేట్‌గా పనిచేశారు. అంతకుముందు వంశీకృష్ణ అని వున్న అతని పేరును కృష్ణవంశీగా మార్చారు వర్మ. అతనిలోని టాలెంట్‌ గుర్తించిన వర్మ.. అనగనగా ఒకరోజు సినిమాని డైరెక్ట్‌ చేసే అవకాశం ఇచ్చారు. రెండు షెడ్యూల్స్‌ పూర్తయిన తర్వాత బడ్జెట్‌ బాగా పెరిగిపోతోందని గ్రహించిన వర్మ.. అతన్ని తప్పించి తనే దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. అయినా బాధపడని వంశీ ఆ సినిమాకే అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.      అనగనగా ఒకరోజు విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత గులాబి కథ రెడీ చేసుకొని చాలా మంది నిర్మాతలకు వినిపించారు వంశీ. ఈ విషయం తెలుసుకున్న వర్మ.. అమితాబ్‌ బచ్చన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌తో కలిసి వర్మ క్రియేషన్స్‌ బేనర్‌లో సినిమా చెయ్యమని ఆఫర్‌ ఇచ్చారు. అలా గులాబి చిత్రంతో కృష్ణవంశీ డైరెక్టర్‌ అయ్యారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అయింది. వంశీ టేకింగ్‌ చూసిన నాగార్జున.. కథ రెడీచేస్తే సినిమా చేద్దాం అన్నారు. యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఒక కథ వినిపించారు వంశీ. నాగార్జున కూడా ఒకే చెప్పారు. గులాబీ చిత్రానికి డైరెక్టర్‌గా మంచి పేరు వచ్చినప్పటికీ.. అందరూ వర్మలా అద్భుతంగా తీశావు అని అప్రిషియేట్‌ చెయ్యడంతో తన పంథా మార్చుకోవాలని డిసైడ్‌ అయి నాగార్జునకు నిన్నే పెళ్లాడతా సబ్జెక్ట్‌ చెప్పారు. అలా నాగార్జున, కృష్ణవంశీ కాంబినేషన్‌లో నిన్నే పెళ్లాడతా ప్రారంభమైంది. అప్పటి వరకు నాగార్జున చేసిన సినిమాలకు భిన్నంగా ఉండడంతో నిన్నే పెళ్లాడతా సినిమాకి ఘనవిజయాన్ని అందించారు ప్రేక్షకులు.    మొదటి రెండు సినిమాలు సూపర్‌హిట్‌ కావడంతో కృష్ణవంశీకి డైరెక్టర్‌గా చాలా మంచి పేరు వచ్చింది. తను అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు ఎంతో సహాయం చేసిన బ్రహ్మాజీతో ఒక సినిమా చెయ్యాలనుకున్నారు వంశీ. పేపర్‌లో వచ్చిన ఒక వార్తను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని సిందూరం కథను సిద్ధం చేశారు. బ్రహ్మాజీ, రవితేజ హీరోలుగా ఆంధ్రా టాకీస్‌ అనే బేనర్‌ను స్థాపించి సొంతంగా ఆ సినిమా చేశారు. మంచి సినిమా అనే ప్రశంసలు, అవార్డులు అందుకున్నప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్‌ అవ్వలేదు. ఈ సినిమా తర్వాత మళ్ళీ నాగార్జునతోనే చంద్రలేఖ చేశారు. ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత చేసిన అంత:పురం కృష్ణవంశీకి చాలా గొప్ప పేరు తెచ్చింది. ఆ తర్వాత చేసిన సముద్రం కూడా విజయం సాధించింది.      ఆ సమయంలోనే మహేష్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. అప్పటివరకు రాజకుమారుడు, యువరాజు, వంశీ చిత్రాలు చేసిన మహేష్‌కు మురారి చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చారు కృష్ణవంశీ. 2002లో అంత:పురం చిత్రాన్ని శక్తి.. ది పవర్‌ పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. కానీ, బాలీవుడ్‌ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించలేదు. కృష్ణవంశీ హిందీలో చేసిన సినిమా ఇదొక్కటే. అదే సంవత్సరం శ్రీకాంత్‌, రవితేజ, ప్రకాష్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో వంశీ తెరకెక్కించిన ఖడ్గం సంచలన విజయం సాధించింది. దేశభక్తిని ప్రబోధించే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పటికీ ఆగస్ట్‌ 15, జనవరి 26కి ఈ సినిమాను టీవీలో ప్రసారం చేస్తుంటారు. ఈ సినిమా తర్వాత డేంజర్‌, రాఖీ, చందమామ, శశిరేఖా పరిణయం, మహాత్మ, మొగుడు, పైసా, గోవిందుడు అందరివాడేలే, నక్షత్రం వంటి సినిమాలు చేశారు. అందులో రాఖీ, చందమామ మాత్రమే విజయం సాధించాయి.    2017లో చేసిన నక్షత్రం చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూడడంతో కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు కృష్ణవంశీ. ఆరేళ్ళ గ్యాప్‌ తర్వాత 2023లో మరాఠీలో విష్ణు వామన్‌ రచించిన నటసామ్రాట్‌ అనే నాటకం ఆధారంగా రంగమార్తాండ చిత్రాన్ని రూపొందించారు. ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.    ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే.. గులాబి చిత్రంతో కృష్ణవంశీకి అభిమానిగా మారిపోయారు రమ్యకృష్ణ. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అలా ఏడు సంవత్సరాలపాటు ప్రేమలో మునిగి తేలిన వీరిద్దరూ 2003లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు. పెళ్లి తర్వాత కూడా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు రమ్యకృష్ణ. వాటిలో బాహుబలిలో పోషించిన శివగామి పాత్ర ఆమెకు గొప్ప పేరు తీసుకొచ్చింది. కృష్ణవంశీకి రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే ఎంతో అభిమానం. అతను డైరెక్ట్‌ చేసిన చాలా సినిమాలకు సీతారామశాస్త్రి పాటలు రాశారు. ఆయన్ని తన తండ్రిగా భావించేవారు వంశీ. ఆయన కూడా వంశీని కొడుకులాగే చూసేవారు. అంతేకాదు, చట్టపరంగా కాకుండా హిందూ సాంప్రదాయ పద్ధతిలో కృష్ణవంశీని దత్తత చేసుకున్నారు సీతారామశాస్త్రి.   (జూలై 28 దర్శకుడు కృష్ణవంశీ పుట్టినరోజు సందర్భంగా..)  

నిర్మాతను చెప్పుతో కొట్టిన నటి.. అది కూడా పబ్లిక్‌లో!

Publish Date:Jul 26, 2025

ఇటీవలి కాలంలో ఫిలిం ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు చాలా ఎక్కువైపోయాయి. వివాదాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. అయితే గతంలో ఇవి బయటికి ఎక్కువగా వచ్చేవి కావు. దానికి కారణం ఆరోజుల్లో మీడియా అంత విస్తృతంగా లేకపోవడం వల్ల ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చిన వారే పరిష్కరించుకునేవారు. కానీ, ఇప్పుడలా కాదు, ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో సోషల్‌ మీడియాలోకి వచ్చేస్తోంది. తాజాగా బాలీవుడ్‌లో జరిగిన వివాదం కారణంగా నిర్మాతను ఓ నటి పబ్లిక్‌లో చెప్పుతో కొట్టే వరకు వెళ్లింది. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. మొదట ఆ నటి నిర్మాతను ఎందుకు కొట్టింది అనే విషయం ఎవరికీ తెలీదు. అయితే దానికి సంబంధించిన వివరాలు కూడా అందుబాటులోకి రావడంతో ఈ వార్త వైరల్‌ అయిపోయింది.  హిందీ సీరియల్స్‌లో నటించే రుచి గజ్జర్‌ అనే నటి, నిర్మాత కరణ్‌సింగ్‌ చౌహాన్‌ మధ్య వివాదమిది. కరణ్‌సింగ్‌ చౌహాన్‌ తాజాగా నిర్మించిన ‘సొలాంగ్‌ వ్యాలీ’ చిత్రం శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా స్క్రీనింగ్‌కి వచ్చిన రుచి గజ్జర్‌ అతనిపై చెప్పుతో దాడి చేసింది. వివరాల్లోకి వెళితే.. ఒక సీరియల్‌కి సంబంధించి రుచిని సంప్రదించాడు కరణ్‌ సింగ్‌. ఆ సీరియల్‌కి కో ప్రొడ్యూసర్‌గా చేరమని కోరాడు. ఆ సీరియల్‌ నిర్మాణం కోసం 24 లక్షల రూపాయలను పలు బ్యాంకుల్లోని అతని ఎకౌంట్స్‌లో డిపాజిట్‌ చేసింది రుచి. ఇది జరిగి రెండు సంవత్సరాలవుతున్నా ఇంతవరకు సీరియల్‌ ప్రారంభించలేదు. దాంతో తన డబ్బు రిటర్న్‌ చేయమని కరణ్‌సింగ్‌ను కోరింది రుచి. అయితే ఆ డబ్బు ఇవ్వకుండా ఏదో ఒక సమాధానం చెబుతున్నాడు. అలా అడిగినందుకు తనను బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది రుచి. సీరియల్‌ నిర్మాణం కోసం తీసుకున్న డబ్బును ‘సొలాంగ్‌ వ్యాలీ’ చిత్రాన్ని నిర్మించేందుకు వాడుకున్నాడన్నది రుచి ఆరోపణ. ఇప్పటికే దీనికి సంబంధించి ఫిర్యాదు చేసింది. ముంబై పోలీసులు కరణ్‌సింగ్‌ చౌహాన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరణ్‌సింగ్‌తో గొడవ పడేందుకే ‘సొలాంగ్‌ వ్యాలీ’ స్క్రీనింగ్‌కి వచ్చింది రుచి. అందరి ముందు అతన్ని చెప్పుతో కొట్టి తన దగ్గర ఉన్న పోలీస్‌ ఎఫ్‌ఐఆర్‌ కాపీని అందరికీ చూపిస్తూ కరణ్‌ని తిట్టడం మొదలు పెట్టింది. కూల్‌గా ఉండమని అందరూ చెప్తున్నా ఆమె వినలేదు. ‘నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బు అది.. కూల్‌గా ఎలా ఉండమంటారు?’ అంటూ ప్రశ్నించింది. రుచి, కరణ్‌సింగ్‌ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల గురించి, థియేటర్‌ దగ్గర జరిగిన ఘటన గురించి ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇండస్ట్రీకి కొత్త లిటిల్ సింగర్...

Publish Date:Jul 27, 2025

  బిగ్ బాస్ సీజన్ 5 లో విశ్వ చేసిన సందడి, ఆడిన టాస్కులు ఎవరూ మర్చిపోరు. విశ్వా ఒక ఫిట్నెస్ ఫ్రీక్. అలాగే మూవీస్ లో నటిస్తూ ఉంటాడు. బుల్లితెర మీద షోస్ లో రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటాడు. ఇన్స్టాగ్రామ్ లో ఐతే చెప్పక్కర్లేదు. ఫుల్ రీల్స్ , జిమ్ వీడియోస్ తో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ఇక రీసెంట్ గా తనతో పాటు తన సుపుత్రుడిని కూడా వెంట షోస్ కి తీసుకొస్తున్నాడు.    విశ్వా కుమారుడి పేరు ర్యాన్. ఈ పిల్లాడి అల్లరి చెప్పక్కర్లేదు. అంజలి - పవన్ వాళ్ళ అమ్మాయి చందమామకు మంచి స్నేహితుడు. టాస్కుల్లో ఆమెను గెలిపిస్తూ హ్యాపీగా ఉంటాడు. ఇక రీసెంట్ గా ర్యాన్ సింగింగ్ కూడా స్టార్ట్ చేసాడు. తనలో మంచి సింగర్ ఉన్నాడని గుర్తించిన విశ్వా ఒక మంచి పాటను పాడించారు స్టూడియోలో.    "అందం అమ్మాయైతే నీలా ఉందా" అనే అందమైన పాటని ఈ చిన్నారి ర్యాన్ పాడుతుంటే అద్భుతంగా ఉంది. ఇక ఫైనల్ లో "నేను సింగింగ్ ని ప్రాక్టీస్ చేస్తున్న. మరి నా సింగింగ్ ప్రాక్టీస్ ఎలా ఉందో కామెంట్స్ చెప్పండి" అని అన్నాడు. అంతే నెటిజన్స్ ఐతే "సూపర్ వాయిస్, సో క్యూట్ సింగర్..చందమామ కోసమా ఈ సాంగ్. నీ వాయిస్ ఇంకా వినాలనిపిస్తోంది. సూపర్ చిన్నా...గాడ్ బ్లేస్ యు" అంటూ విషెస్ చెప్తున్నారు.    ఈ మధ్య కాలంలో పేరెంట్స్ తో పాటు వాళ్ళ పిల్లలు కూడా షోస్ కి వస్తున్నారు. బుల్లితెర నటి శ్రీవాణి వాళ్ళ అమ్మాయి నందిని ఢీ 20 లో కంటెస్టెంట్ గా చేస్తోంది. అలాగే రాఘవ వాళ్ళ అబ్బాయిని మురారిని జబర్దస్త్ స్కిట్స్ కి తీసుకొస్తూ ఉంటాడు. ఇక విశ్వా తన కొడుకు ర్యాన్ ని అలాగే అంజలి- పవన్ వాళ్ళ అమ్మాయి చందమామను, ఇంకా సమీరా భరద్వాజ్ వాళ్ళ అమ్మాయిని కూడా షోస్ కి తీసుకొస్తూ ఉంటారు.  

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

SSMB29: మహేష్ బాబు ఫ్యాన్స్ కి బిగ్ షాక్..!

Publish Date:Jul 26, 2025

  సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ని కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్.. 'SSMB29' వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 'SSMB29' అప్డేట్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో వారికో షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.   రాజమౌళి తన గత సినిమాలకు భిన్నంగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వకుండానే 'SSMB29' షూట్ మొదలుపెట్టారు. ఇప్పటికే రెండు మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇంతవరకు సినిమా నుంచి ఒక అఫీషియల్ పోస్టర్ కూడా రాలేదు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు. దీంతో ఆరోజు అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు.. గ్లింప్స్ విడుదల ఉంటుందని అభిమానులు భావించారు. అయితే మహేష్ బర్త్ డేకి ఎటువంటి అప్డేట్ ఉండదని తెలుస్తోంది. అనౌన్స్ మెంట్ కి ఇంకా టైం తీసుకోబోతున్నారని సమాచారం. ఓ రకంగా ఇది ఫ్యాన్స్ కి షాకిచ్చే న్యూస్ అని చెప్పవచ్చు. అయితే 'SSMB29' గ్లింప్స్ ఎప్పుడు విడుదలైనా.. ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోవడం ఖాయమని అంటున్నారు.  

STR and Vetrimaaran film canceled like Vaadivaasal?

Publish Date:Jul 26, 2025

Silambarasan aka STR, has suddenly locked his next with Vetrimaaran. Also, the movie story has deep connection with Vada Chennai, the cult classic of Vetrimaaran with Dhanush. As this movie promo shoot has been completed, many of actor fans have been waiting to hear positive updates regarding the film.  But suddenly, the rumors about film will be canceled or postponed indefinitely like Vaadivaasal have been going around. While the team have been silent about such reports, it is stated that STR has asked for 50 crores remuneration and producer S. Thanu asked him to accept Rs.20 crores plus profit share, deal it seems.  Currently, the reports suggest that team is putting up a set in popular studio in Chennai and the movie is not canceled or postponed. While there might have been negotiations with the producer for STR, he doesn't want to give up on this film with such a popular and quality director, that too, linked with popular franchise.  At the moment, the set works regarding the film are going on say reports but if these negotiations about remuneration doesn't come to a conclusion by 15th August, the movie could be canceled or postponed indefinitely. Well, producer Thanu, had already spent too much on Vaadivaasal and hence, he wants this movie to go on sets, come what may, it seems. Let's wait and see.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

జూనియర్

Publish Date:Jul 18, 2025

తమ్ముడు

Publish Date:Jul 4, 2025

Hari Hara Veera Mallu

Publish Date:Jul 24, 2025

Junior

Publish Date:Jul 18, 2025

Oh Bhama Ayyo Rama

Publish Date:Jul 11, 2025

Thammudu

Publish Date:Jul 4, 2025

Uppu Kappurambu

Publish Date:Jul 4, 2025