English | Telugu
వీరమల్లు కలెక్షన్స్ పై నోరు విప్పిన డైరెక్టర్!
Updated : Jul 27, 2025
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'హరి హర వీరమల్లు'. జూలై 24న విడుదలైన ఈ మూవీ డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ స్టార్డమ్ తో మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. అయితే మేకర్స్ మాత్రం ఇంతవరకు అధికారంగా వసూళ్లను ప్రకటించలేదు.
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా.. అన్ని కోట్లు ఇన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటూ పోస్టర్లు రిలీజ్ చేస్తుంటారు మేకర్స్. కానీ, హరి హర వీరమల్లు విషయంలో అలా జరగలేదు. ఇదే విషయంపై తాజాగా చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ స్పందించాడు.
"మనం ఎంత నిజాయతీగా కలెక్షన్స్ గురించి చెప్పినా.. అవి కరెక్టా కాదా అని కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ప్రజెంట్ కొన్ని సైట్స్ ఎలాగూ కలెక్షన్స్ ఇస్తూనే ఉన్నాయి. అందుకే మేము ఒకప్పటిలాగా మా సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుందని మాత్రమే పోస్టర్లు వేస్తున్నాం." అని జ్యోతి కృష్ణ చెప్పుకొచ్చాడు.
కాగా, ట్రేడ్ వర్గాల ప్రకారం హరి హర వీరమల్లు సినిమా మొదటి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.90 కోట్ల గ్రాస్ రాబట్టింది. నాలుగు రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరనుందని అంటున్నారు.