English | Telugu
అరుణాచలంలో ఆట సందీప్ క్రేజ్!
Updated : Jul 27, 2025
ఆట సందీప్, అతని వైఫ్ జ్యోతి రాజ్ సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్నారు. భర్త-భార్య ఎలా అండర్ స్టాండింగ్ తో ఉండాలి అని జ్యోతి చెప్పిన రీల్ బాగా వైరల్ అయ్యింది. అలాగే సందీప్ నేర్పే డాన్స్ స్టెప్స్ తో చాలామంది డాన్స్ కూడా నేర్చుకుంటున్నారు. రీసెంట్ గా సందీప్ ఒక రీల్ ని ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు.
"హలో ఆల్ ..చాలామంది నాకు అరుణాచలం గురించి వాట్సాప్ చేస్తూ ఉన్నారు. ఆటో మీద నా పిక్స్ పెట్టుకున్నారంట. వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారో నాకు తెలీదు..లవ్ యు సందీప్ మాష్టర్. లవ్ యు సందీప్ అన్నా అంటూ ఆటోల మీద స్టిక్కర్స్ ఉన్నాయంట. వాటిని ఫొటోస్ తీసి నాకు పంపిస్తున్నారు. వాళ్లకు రియల్లీ థ్యాంక్స్ . నేను అరుణాచలం ఒక్కసారే వెళ్లాను. శివుడి మాల వేసుకుని గిరి ప్రదక్షిణ చేసాను. నాకు, జ్యోతికి లైఫ్ లో చాలా చాలా చేంజెస్ ఉన్నాయి. మేము చాల సంతోషంగా ఉన్నాము. తప్పకుండా ఎవరన్నా అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే ఒక్కసారన్నా వెళ్లి రండి. మీ జీవితంలో చాల మార్పులు వస్తాయి. ఆటో అన్నలందరికీ చాలా థ్యాంక్స్ ..ఎందుకు నా ఫోటో పెట్టుకున్నారో కానీ నేను చాల హ్యాపీగా ఉన్నాను. ట్యాగ్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ చాలా థ్యాంక్స్. లవ్ యు ఆల్..ఓం నమఃశివాయ. తప్పకుండా అరుణాచలం వెళ్లి విజిట్ చేయండి." అంటూ చెప్పాడు సందీప్.
సందీప్ రీసెంట్ గా ఒక డాన్స్ స్కూల్ స్టార్ట్ చేశారు. అలాగే బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ గా వెళ్లారు. ఇక నీతోనే డాన్స్ రియాలిటీ షోలో విన్ అయ్యారు సందీప్ మాష్టర్.