'జబర్దస్త్' జడ్జ్ ఇంద్రజ అసలు పేరును ఊహించగలరా?
తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసిన నటి ఇంద్రజ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. తన సెకండ్ ఇన్నింగ్స్ ను ఇటీవల మొదలుపెట్టారు. ఈ క్రమంలో పలు చిత్రాల్లో నటించారు. ఈ మధ్యకాలంలో 'శతమానం భవతి', 'సాఫ్ట్వేర్ సుధీర్', 'అల్లుడు అదుర్స్' వంటి చిత్రాలలో నటించారు.