English | Telugu

చెప్పుల దండేసి ఊరేగిస్తామంటూ.. నిరుపమ్‌కి బెదిరింపులు!

'కార్తీకదీపం' సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రతో సూపర్ ఫేమస్ అయిపోయాడు నిరుపమ్ పరిటాల. బుల్లితెర ప్రేక్షకుల్లో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా నిరుపమ్ తన భార్య మంజులతో కలిసి 'అలీతో సరదాగా' షోకి అతిథులుగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నాడు. తన ఇంటి పేరు పరిటాల కావడంతో పరిటాల రవి పేరుని చాలా సందర్భాల్లో వాడేశానని నిరుపమ్ చెప్పాడు.

'ఇంద్ర' సినిమా ఫస్ట్ డే థియేటర్ కు వెళ్లినప్పుడు కానిస్టేబుల్ తన బైక్ కీ తీసుకొని వెళ్లిపోతుండగా.. అతడి దగ్గరకి వెళ్లి పరిటాల రవికి ఫోన్ చేస్తా అంటూ బెదిరించానని.. దీంతో కీ ఇచ్చేసి నెక్స్ట్ డే మూవీ టికెట్స్ కూడా ఆయనే ఇచ్చారని అప్పటి సంగతులు గుర్తు చేసుకున్నాడు. నిరుపమ్ తో పాటు అతడి భార్య మంజుల కూడా పరిటాల పేరుని వాడేశానని అన్నారు. లైసెన్స్ తీసుకున్న సమయంలో పరిటాల రవి మీకు బంధువులు అవుతారా? అని అడిగారని.. అవునని చెప్పడంతో వెంటనే లైసెన్స్ ఇచ్చారని చెప్పుకొచ్చారు.

ఇక ఓ సీరియల్ చేస్తోన్న సమయంలో త‌న‌కు బెదిరింపులు వ‌చ్చిన విష‌యాన్ని నిరుపమ్ బయటపెట్టాడు. చంపేస్తాం.. నువ్ ఎలా ఉంటావో చూస్తామంటూ మెయిల్స్, కాల్స్ వచ్చేవని.. చెప్పుల దండ వేసి సన్మానం చేస్తామంటూ ఓ రేంజ్ లో వార్నింగ్ లు ఇచ్చేవారని తెలిపాడు. ఆ పాత్ర మీద వాళ్లు చూపించే అతి ప్రేమ అనుకోవచ్చని.. సీరియల్ ని సీరియల్ లా చూస్తే ఇంతలా రియాక్ట్ అవ్వరని.. కాస్త ఎక్కువ‌ కావడం వలన ఇలాంటి ఇబ్బందులు వస్తాయని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.