English | Telugu

ఇటు భార్య‌తో రొమాన్స్‌.. అటు న‌వ్యతో కెమిస్ట్రీ!

బుల్లితెరపై వచ్చే షోలలో ఈ మధ్యకాలంలో రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువైంది. లవ్ ట్రాక్స్, డబుల్ మీనింగ్ డైలాగులు ఇప్పటికే చాలా ఎక్కువయ్యాయి. అయితే యాంకర్ సుమ నిర్వహించే షోలావు ఇలాంటివి పెద్దగా కనిపించవు. కానీ తాజాగా విడుదలైన 'క్యాష్' ప్రోమోలో మాత్రం రొమాన్స్ ఓ రేంజ్ లో పండించారు. ఈ ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. రియల్ జంట, రీల్ జంట అంటూ వచ్చే వారం ప్రసారం కాబోయే ఓ ఎపిసోడ్ లో సుమ గెస్ట్ లను ఓ రేంజ్ లో ఆడుకున్నారు.

రియల్ జంటలో భాగంగా 'దేవత' సీరియల్ ఫేమ్ అర్జున్, అతని భార్య సురేఖలను గెస్ట్ లుగా తీసుకురాగా.. రీల్ జంటలో భాగంగా రవికృష్ణ, నవ్యలను తీసుకొచ్చారు. షోలో భాగంగా సురేఖను.. మీ ఆయన రాత్రి తొమ్మిది గంటలకు వస్తానని చెప్పి పన్నెండు అయినా రాకపోతే ఏం చేస్తావని సుమ అడిగారు. దానికి సురేఖ వెంటనే.. వీడియో కాల్ చేస్తా అని అనడం, దానికి రవి "నెట్ ఆఫ్ చేస్కో" అని సలహా ఇవ్వడం అందరినీ నవ్వించింది. ఆ తరువాత నవ్యని.. "లవ్ మ్యారేజ్ చేసుకుంటావా..? ఎరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటావా..?" అని సుమ ప్రశ్నించింది. దాని నవ్య.. "అరేంజ్డ్" అని.. లవ్ చేసినా.. పెద్దలను కన్విన్స్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పింది.



వెంటనే సుమ "మరి ఎవరినైనా లవ్ చేస్తున్నావా..?" అని అడిగింది. దానికి నవ్య.. రవికృష్ణ వైపు చూసి లేదని చెప్పింది. దీంతో సుమ "అటు వైపు ఎందుకు చూశావ్?" అంటూ నవ్యని ఏడిపించేసింది. మ‌ధ్య‌లో ర‌వికృష్ణ "యాక్ష‌న్" అని చెప్ప‌గా, అర్జున్‌, న‌వ్య‌స్వామి రొమాంటిక్ సీన్‌కు ప‌ర్ఫామ్ చేయ‌డం, దాన్ని చూసి సురేఖ ఉడుక్కోవ‌డం అల‌రించింది.

చివర్లో అర్జున్ తన భార్యకు ప్రపోజ్ చేస్తూ.. గులాబీపువ్వుని ఇచ్చాడు. ఆ పువ్వుని మునిపంటితో బంధించేసింది సురేఖ. అప్పుడు అర్జున్ తన నోటితో ఆ పువ్వుని లాగేసుకోవడంతో అందరూ నోరెళ్లబెట్టేశారు. దీనికి సంబందించిన ప్రోమో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.