English | Telugu

'జబర్దస్త్' జడ్జ్ ఇంద్రజ అసలు పేరును ఊహించ‌గ‌ల‌రా?

తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసిన నటి ఇంద్రజ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. తన సెకండ్ ఇన్నింగ్స్ ను ఇటీవ‌ల‌ మొదలుపెట్టారు. ఈ క్రమంలో పలు చిత్రాల్లో నటించారు. ఈ మధ్యకాలంలో 'శ‌త‌మానం భ‌వ‌తి', 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్', 'అల్లుడు అదుర్స్' వంటి చిత్రాలలో నటించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఇంద్రజ 'జబర్దస్త్' షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో కొన్ని స్కిట్ లలో ఆమెని పొగుడుతూ కామెంట్స్ చేస్తుంటారు.

ఇంద్రజ పేరుని ఆ ఇంద్రుడే పెట్టాడంటూ ఆమె అందాన్ని పొగుడుతుంటారు. అయితే ఇంద్రజ అసలు పేరు అది కాదట. సినిమాల్లో గుర్తింపు సంపాదించుకోవడం కోసం తన పేరుని ఇంద్రజగా మార్చుకున్నార‌ట‌. 1978వ సంవత్సరంలో చెన్నైలో జన్మించిన ఇంద్రజ అసలు పేరు రాజాతి. ఆమె నటి మాత్రమే కాదు.. సింగర్ కూడా. స్కూల్ లో చదువుకునే సమయంలోనే ఇంద్రజ సంగీత పోటీలతో పాటు నాటక పోటీలలో పాల్గొని బహుమతులు సొంతం చేసుకున్నారు.

తెలుగుతో పాటు మలయాళంలో కూడా ఇంద్రజ మంచి పేరు సంపాదించుకున్నారు. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన ఆమె.. తమిళంలో కొన్ని రియాలిటీ షోలకు హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు 'జబర్దస్త్' షోకి తాత్కాలికంగా జడ్జ్ గా హాజరవుతున్నారు. రోజా రీఎంట్రీ ఇస్తే.. ఇంద్రజ ఈ షోకి దూరం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇంద్రజ కొన్ని తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.