English | Telugu
'జబర్దస్త్' భజన.. మామూలుగా లేదుగా!
Updated : May 11, 2021
బుల్లితెరపై 'జబర్దస్త్' షోకి ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగులో నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతోంది. గత ఎనిమిదేళ్లుగా ప్రసారమవుతోన్న ఈ షోకి ప్రేక్షకాదరణ రోజురోజుకి పెరుగుతోంది. అయితే కొన్నిసార్లు మల్లెమాల, జబర్దస్త్ షోల మీద జనాల్లో వ్యతిరేకత వచ్చింది. ఆర్టిస్ట్ లను అగ్రిమెంట్ పేరుతో బంధిస్తున్నారని.. ముఖ్యంగా అవినాష్ విషయంలో మల్లెమాలపై నెగెటివిటీ క్రియేట్ అయింది. బిగ్ బాస్ షోకి వెళ్లడానికి అవినాష్ ని మల్లెమాల సంస్థ అనుమతించలేదని.. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి పది లక్షల రూపాయలు కట్టించుకున్నారని అవినాష్ స్వయంగా బిగ్ బాస్ హౌస్ లో చెప్పాడు.
దీంతో 'జబర్దస్త్' షోపై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. దీంతో మల్లెమాల సంస్థ 'జబర్దస్త్' ఇమేజ్ ని పెంచే పనిలో పడింది. స్పెషల్ ఈవెంట్స్ లో 'జబర్దస్త్' షో గొప్పదనం గురించి చెబుతున్నారు. నిజానికి ఈ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది. కానీ అందులో నియంతృత్వ పోకడలున్నాయంటూ విమర్శలు వచ్చాయి. నాగబాబు సైతం 'జబర్దస్త్' షోని వదిలేస్తూ నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. వచ్చేవారం ప్రసారం కాబోతున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో రాకింగ్ రాకేశ్.. బండ్ల గణేష్ అవతారమెత్తి 'జబర్దస్త్' పై తన భక్తిని చాటుకున్నాడు.
ఈ షో ఒక అద్భుతమని.. ఎందరికో జీవితాలను ప్రసాదించిందని తెగ పొగిడేశాడు. అనంతరం జడ్జ్ మనో.. "కొన్ని కోట్ల మంది ఈ షో వలన రిలాక్స్ అవుతున్నారనేది పచ్చి నిజం" అంటూ కామెంట్ చేశాడు. 'జబర్దస్త్ లేకపోతే ఇక్కడ ఎవరం ఉండేవాళ్లం కాదని' హైపర్ ఆది అన్నాడు. "ఈరోజు మాతో పాటు మా కుటుంబాలన్నీ హ్యాపీగా ఉన్నాయంటే కారణం జబర్దస్త్" అని సుధీర్ అన్నారు. ఇలా ఒక్కొక్కరు 'జబర్దస్త్'పై పాజిటివ్ కామెంట్స్ చేస్తుండగా.. 'కేజీఎఫ్' బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేసి వారి మాటలను మరింత ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు.