English | Telugu

మోనాల్ వ‌ల్లే షో చూడ్డం మానేశాం.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

హీరోయిన్ గా ఒకట్రెండు సినిమాలు చేసిన గుజరాతీ ముద్దుగుమ్మ మోనాల్ నటిగా సరైన సక్సెస్ ను అందుకోలేకపోయింది. దీంతో టాలీవుడ్ నుండి షిఫ్ట్ అయి ఇతర భాషల్లో సినిమాలు చేసుకుంది. అదే సమయంలో ఆమెకి బిగ్ బాస్ సీజన్ 4లో ఛాన్స్ రావడంతో తిరిగి ఇక్కడకి వచ్చింది. హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన వెంటనే ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వార్తల్లో నిలిచింది. అఖిల్, మోనాల్, అభిజిత్ లకు సంబంధించి రోజూ వార్తలు వచ్చేవి. అయితే కొన్నిరోజులకే అభిజీత్ దూరం పెట్టడంతో అఖిల్ తో మోనాల్ మరింత క్లోజ్ అయింది.

దీంతో ఇద్దరి మధ్య ఏదో ట్రాక్ నడుస్తోంద‌ని ఫిక్స్ అయిపోయారు జనాలు. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత కూడా వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేయడం, చనువుగా ఉండడం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ షో అనంతరం మోనాల్ కి వరుస అవకాశాలు వస్తున్నాయి. 'అల్లుడు అదుర్స్' సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. అలానే బుల్లితెరపై ప్రసారమవుతోన్న 'డాన్స్ ప్లస్' షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. అయితే మోనాల్ ని జడ్జ్ గా తీసుకున్నప్పటి నుండి ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు నెటిజన్లు.

ఆమెకి జడ్జ్ గా ఉండే అర్హత లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా డాన్స్ ప్లస్ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో మోనాల్ స్టేజ్ పైకి వెళ్లి ఓ కంటెస్టెంట్ తో కలిసి డాన్స్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు మోనాల్ ని మరింత టార్గెట్ చేశారు. మోనాల్ వలనే ఈ షో చూడడం మానేశామంటూ మండిపడుతున్నారు. అందరూ డాన్స్ మాస్టర్స్ జడ్జ్ గా వ్యవహరిస్తుంటే ఈమెను ఎలా తీసుకున్నారంటూ మోనాల్ ను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ట్రోలింగ్ పై మోనాల్ స్పందిస్తుందేమో చూడాలి!

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.