English | Telugu

క్యూట్ పోజుల‌తో రచ్చ చేస్తోన్న రష్మీ!

'జబర్దస్త్', 'ఎక్ట్రా జబర్దస్త్' షోల ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది రష్మీ గౌతమ్. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. బుల్లితెరపై దూసుకుపోతున్న రష్మీ సినిమా ఆఫర్లు కూడా అందిపుచ్చుకుంటోంది. దాదాపు ఎనిమిదేళ్లుగా తన సత్తా చాటుతోన్న రష్మీ.. తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోగలిగింది. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

తాజాగా బ్లాక్ డ్రెస్ లో తీసుకున్న కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అతి తక్కువ సమయంలో ఈ ఫోటోలకు లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. ఈ ఫొటోల్లో అమ్మడు క్యూట్ పోజుల‌తో, కొద్దిపాటి క్లీవేజ్ షోతో రచ్చ చేసింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు చాలా అందంగా ఉన్నావని.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోవంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఓపక్క 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' షోతో పాటు 'ఢీ' షోలో టీమ్ లీడర్ గా వ్యవహరిస్తోన్న రష్మీ సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంటుంది. మూగ జీవాలను కాపాడాలంటూ ఎప్పటికప్పుడు రష్మీ పోస్ట్ లు పెడుతూనే ఉంటుంది. అలానే లాక్ డౌన్ సమయంలో ఆకలితో ఇబ్బంది పడుతున్న వీధి కుక్కలకు ఆహరం అందేలా రష్మీ చర్యలు చేపట్టింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.