English | Telugu
కీర్తి సీమంతంలో డాక్టర్ బాబు దంపతులు.. ఫోటోలు వైరల్!
Updated : May 11, 2021
బుల్లితెరపై అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతున్న సీరియల్ 'కార్తీకదీపం'. నటుడు నిరుపమ్ పరిటాల డాక్టర్ బాబు పాత్రలో, ప్రేమి విశ్వనాథ్.. దీప పాత్రలో జీవించేస్తున్నారు. రీసెంట్ గా డాక్టర్ బాబు రియల్ లైఫ్ మరదలికి సీమంతం జరిగింది. ఈ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నటుడు, రచయిత ఓంకార్ పరిటాల వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నిరుపమ్ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆయన భార్య మంజుల కూడా సీరియల్స్ లో నటిస్తోంది. ఆమె సోదరి కీర్తి, సోదరి భర్త ధనుష్ కూడా సీరియల్ నటులే. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. కీర్తి ఓ ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతున్న 'హిట్లర్ గారి పెళ్లాం' అనే సీరియల్ లో నటిస్తోంది. కీర్తి భర్త ధనుష్ కూడా సీరియల్స్ లో హీరోగా నటిస్తున్నాడు. అతను కొన్ని సినిమాల్లోనూ నటించాడు. రీసెంట్ గా కీర్తి సీమంతం ఆమె నివాసంలోనే ఘనంగా జరిగింది.
కరోనా కారణంగా అతి తక్కువమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వేడుక జరిగింది. ఈ వేడుకలో నిరుపమ్ తన భార్య మంజులతో కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను మంజుల తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కీర్తి కన్నడ సీరియల్స్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో సైతం ఆమె పలు సీరియల్స్ లో నటించింది.
