English | Telugu

ముక్కు అవినాష్ పెళ్లి ఫిక్స్ కానీ..!

'జబర్దస్త్' షోతో బుల్లితెరకు పరిచయమైన కమెడియన్ ముక్కు అవినాష్. తన కామెడీ టైమింగ్ తో క్రేజ్ తెచ్చుకున్న అవినాష్ కి బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ వచ్చింది. హౌస్ లో అవినాష్ ఎంట్రీ ఇచ్చిన తరువాత తన కామెడీతో అందరినీ ఎంటర్టైన్ చేశాడు. తన పాపులారిటీ బాగా పెంచుకున్నాడు. దీంతో వరుస ఆఫర్లు అందుకుంటూ బుల్లితెరపై దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా అవినాష్ పెళ్లికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బిగ్ బాస్ నాలుగో సీజన్ సమయంలోనే అవినాష్ పెళ్లి విషయం హాట్ టాపిక్ అయింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు కూడా అవినాష్ తన పెళ్లి గురించే మాట్లాడుతుండేవాడు. అదే సమయంలో అరియనా గ్లోరీతో ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించేవాడు. అంతేకాదు.. హౌస్ లోకి వచ్చిన వాళ్ల అమ్మతో తన పెళ్లి చేయమని కోరాడు. దీంతో అప్పట్లో అవినాష్ పెళ్లి వార్తలు హైలైట్ అయ్యేవి. ఇటీవల ఈ టాప్ కమెడియన్ కి పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. బుల్లితెర వర్గాల్లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.

నిజానికి ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోవాలని అవినాష్ భావించాడట. కానీ ఇప్పడు వచ్చే ఏడాదికి పెళ్లి వాయిదా వేసుకున్నట్లు టాక్. ప్రస్తుతం కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో అవినాష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీకి సంబంధం లేని ఓ తెలంగాణ అమ్మాయిని అవినాష్ పెళ్లి చేసుకోబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం అవినాష్ 'కామెడీ స్టార్స్' అనే షోతో పాటు పలు షోలలో సందడి చేస్తున్నాడు.