Facebook Twitter
అస్థిత్వ పోరాటం (కవిత)

 

అస్థిత్వ పోరాటం



 తిండికోసం అల్లాడుతున్న చీమలకు
పసుపు నీళ్ళు గుమ్మరిస్తే విలవిల్లాడిపోతున్న జీవాల్లా
తరతరాల ఆచారపు అణిచివేతల్లో
కొట్టుమిట్టాడుతున్న ఒక విగతజీవిని...

ఆత్మీయతల ఉచ్చులో
అస్తిత్వాన్ని కోల్పోయి
బావిలో కప్పలా ఇదే జీవితమని మురిసిపోయే
నామమాత్రపు మనిషిని...

రెండు సూత్రాల తాడు వెనుక
బిగుసుకుపోయే ఉరితాళ్ళెన్నో

పైకి ప్లాస్టిక్ నవ్వుతో
ప్రీమోల్టన్లా స్రావాన్ని ఆపుతూనే
అరిగిపోయే నడుము ఎముకల్లా
వెనుక చిచ్చుపెట్టే సో కాల్డ్ బంధాలెన్నో..

కొత్త బంధాల పేరుతో
అరువు తెచ్చుకున్న నవ్వుల్లో
నన్ను నేను కోల్పోయిన
ఈ అహంకారపు అడవిలో
బానిసత్వపు కన్నీటి మంటల్ని
ఆర్పలేని నిశిరాత్రులెన్నో...

 

 

 

 

 

...సరిత భూపతి