Facebook Twitter
గురుపూజోత్సవం

 

గురుపూజోత్సవం


 
ఇది గురుపూజోత్సవం
జ్ఞానానికే  ఉత్సవం !
ఇది  చదువులకె సంబరం
ఇది గురువుల సందోహం !

గురువుల మెచ్చినదీ రోజు
గురుతర  బాధ్యత  హెచ్చిన  రోజు
తరతరాల సత్  సంప్రదాయములు
విరిసీ మెరిసిన రోజు !

ప్రతిభకు  పట్టం కట్టిన  రోజు
ప్రభుతయె  గురువుల  మెచ్చిన  రోజు !
దేశ ప్రగతి సాధించగ  చదువులు
దేశమె కాంక్షించిన రోజు !

తరతరాల సంస్కృతీ  భారతిని
తనయుల  కెరిగింపు మను రోజు !
పేరాశలకే  దూరమ్మగుచూ
బోధించే  పరహితమను   రోజు!

ఉత్సాహం ,ఉపకారం , ప్రజ్ఞ,
సత్సంగం,సత్యం,సమభావం 
గోరుముద్దలుగు మన పాపలకిడి
పేరు గాంచుడను నీ రోజు !

భావి భారత  సత్పౌరులనూ
చేవగల వివేకానందులనూ
తీర్చి దిద్దిన స్వతంత్ర భారతిని
తిరిగి కూర్చమన నీ  రోజు !

 

రచన :- నల్లాన్ చక్రవర్తుల వేంకట రంగనాథ్.