మరుజన్మ
మరుజన్మ
.png)
కురిసే ప్రతి చినుకు ఏ ప్రకృతి అందాన్ని
ముద్దాడుతుందో తెలియదు..
కానీ నువ్వేచోటనున్నా నీ చూపులు
నా తలపులను ముద్దాడుతాయి ..
ప్రతీ కన్నీటిబొట్టు కష్టానికే రాలకపోవచ్చు
కానీ నీ సహవాసానికి నోచుకోని మనసు
మౌనంగా రాలుస్తున్న కన్నీటిబొట్లు అనంతం ..
నిశిరాత్రి నిశ్శబ్దంలో పిల్లతెమ్మెరలా తాకిన
ప్రతీ కల కవ్వించకపోవచ్చు..
కానీ నీకోసం వేచి చూస్తూ రెప్పవేయని కలల వెనక
నువ్వు రాలేవన్న నిజమెప్పుడూ జడిపిస్తుానే ఉంటుంది..
నిన్ను ఈ జన్మకు చేరుకోలేనని తెలిసాక
ఉంటుందో లేదో తెలియని మరుజన్మను పొందాలనుందిప్పుడు..
మనిషెంత ఆశాజీవో కదూ!
నిన్ను చేరే ఆ క్షణం కోసం
నన్ను నేను వృథా చేసుకున్న సరే!
మరుజన్మంటూ ఉంటే
నిన్నక్కడ కూడా కోల్పోలేను..
.jpg)
..... సరిత భూపతి



