Facebook Twitter
నువ్వు నేను

 

 



కల్మషంలేని పసిపాపవంటి కనుపాపవు నీవు
నీ వాకిట్లో జారే కన్నీటి బిందువు నేను...

నా హృదయ వీణవు నువ్వు
నువ్వు మీటే వలపు తంత్రిని నేను...

ఉదయాన్నే వికసించే చిరునవ్వుల పుష్పానివి నువ్వు..
నాకంటుా గుర్తింపు లేకపోయినా నీ వెనకే ఉండే ముల్లుని నేను...

ఆనందంతో దుాకి వచ్చిన వానమబ్బును నీవు
నీ ఆనందంలో అవనినై తడిసి ముద్దవుతా నేను ...
ప్రపంచానికే వెలుగువు నీవు
నిన్ను వెలిగించటానికే కొవ్వొత్తినై కరిగిపోతా నేను ..
రాగహేళిలో ఓలలాడించే వేణువు నీవు
నీపై రాగాన్ని పలికించే గాయాన్ని నేను ...

తొలకరిజల్లుకు పరవశించి నాట్యమాడుతుా ఆనందభాష్పాలు రాల్చే మయుారానివి నీవు...
నీ అశ్రువులు తాగి పరిపుార్ణమైన మయుారిని నేను
సృష్టికి తేజం నీవు
సృష్టికి ముాలం నేను
మనమెుకటైతేనే సృష్టికి అర్థం ... పరమార్థం ...

 

 

 

 

........సరిత భూపతి