Facebook Twitter
చూపు

చూపు

 



అవును
ఒక్కోసారి చూపులక్కూడా ముల్లుంటాయి
ఆనందం కుషకు
గుండుసూదుల్లా గుచ్చుకుంటాయి
విజయకేతనాన్ని
అసూయాగ్నిలో స్నానం చేయిస్తాయి
పెదవుల కోసనవ్వులతో అభినందిస్తూ
నొసటి వెక్కిరింతలతో నలిబిలి చేస్తాయి
శక్తి ఉండాలే గాని
ఎదుటి వారి సంతోషాన్నిండా
గుప్పెడు దుమ్ము జల్లుతాయి

ఆనందార్ణవాలనుదాచుకుంటూ
గెలుపుల్ని ప్రకటించకుండా ఎలా!
కొన్ని చూపుల పదునుకు
చీకటి పరదాలలో దక్కోవాలనిపిస్తుంది
మాటకంటే లోతు గాయం చేసే
చూపుల్ని మళ్ళించలేం గానీ
ఆత్మబలం కవచంతో
అడ్డుకోగలం గదా!

- సి. భవానీదేవి