Facebook Twitter
కల

కల
సగంలోనే తెగింది
మెలకువ
వేకువ దాకా వేధించింది

అద్దం బ్రద్దలు కొట్టానని
విర్రవీగకు
ప్రతిబింబాలు
పదింతలైనాయి.

చెట్టు కొమ్మలు
విస్తరించాడనికే
ఉరేసుకుని
అస్తమించడానిక్కాదు

- వై. రామకృష్ణారావు