Facebook Twitter
అరిటాకు, ముల్లు

అరిటాకు, ముల్లు
సామెత నాకెందుకు ?
ఆకులో భోజనం పెట్టు
అది చాలు.

చలికి
మాటలూ గడ్డకట్టినై
వేసవి వస్తేనే
కరిగి వినిపిస్తాయా ?

రవి
చీకటి  మురికిని ఉతికేస్తే
విశ్వావరణ వస్త్రం
పారదర్శకం.


డా. వై .రామకృష్ణారావు