Facebook Twitter
హెచ్చరిక

హెచ్చరిక

- డా. సి భావనీదేవి

 

అది యాసిడో,కత్తో
ఏదైనా ' ప్రేమ, అని భ్రమించకు చెల్లి

లైలా మజ్నూప్రేమ
దేవదాస్ పారుల త్యాగం
శ్రీలక్ష్మి,మీనాకుమారి హింస బలి
ఎవరైనా ' ప్రేమ  అంటే
దిక్కరించాల్సిందే
ఏ గుండెలో ఏ మారణాయుధముందో
నిలువునా స్కానింగ్ చేయాల్సిందే

ఆడపిల్లై పుట్టినందుకు
వడ్లగింజ నుంచి పసుపుతాడు దాకా
చావు ద్వారమేదో ఎలా తెలుస్తుంది!

అందం,చదువు,ఉద్యోగం పాతమాట
ఇప్పుడు 'అమ్మాయి' అయితే మాత్రం
ప్రేమికుడొస్తున్నాడంటే
అందనంత దూరానికి పారిపోవల్సిందే
విదేశంలో కూడా మృత్యు నీడల్లాంటి
కసాయి ప్రేమికుడికోసం కత్తి పడతారో
డాలు సిద్దం చేసుకుంటారో మరి
అమ్మాయిలు జాగ్రత్త
ప్రేమికుడొస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త!