Facebook Twitter
లోపలి నది

లోపలి నది

 

- డా .సి.భవానీదేవి

ఇంకా ఎంతదూరం పారిపోగలం ?
చుట్టూ సమూహాలే
నా అన్నవారి కోసం వెతుకులాట

చుట్టూ సముద్రాలే!
దాహానికి చుక్క నీటికోసం వెంపర్లాట

లోపల్నించి మింగేస్తున్న ఏకాకితనానికి
జీవితాన్నిపణంగాపెట్టాలా!
ఆరాటాల వెల్లువలో కోల్పోతున్న
సహజాతాల మాటేంటి ?

ఒంటరితనం తప్ప
ఎవరు నీవారు ?
ఈ చీకటి దుఃఖాల సుడులమధ్య
నిబ్బరాన్ని ఇంకెంతకాలం నటిస్తావ్ ?
లోపలి నదుల్ని
బయటకి ప్రవహించనీయక పోతే
నిన్నే నిలువునా ముంచేయవూ!

నలుగురు కాకపోయినా
ఒక్కరినైనా మిగుల్చుకోవాలి కదా!

అది మాత్రం
డబ్బు సంపాదించినట్లు కాదు
అసలు నీకేం కావాలో తెల్సా ?
పరుగు ఆపి క్షణం ఆలోచించు
లోపలి ప్రవాహం ఇంకే లోపు!